Mr. Bachchan: బిజినెస్ డీటెయిల్స్ బయటపెట్టిన జర్నలిస్ట్, డైరెక్టర్ ని కాబట్టే మర్యాదగా మాట్లాడుతున్న అంటూ స్ట్రాంగ్ వార్నింగ్

Mr. Bachchan: ప్రస్తుతం ఉన్న జర్నలిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది అనగానే ఆ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంతమంది జర్నలిస్టులు అడిగే ప్రశ్నలు చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. ఆ జర్నలిస్టులో ప్రశ్నలను చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ మాట్లాడుతుంటారు. కొందరు సినిమాకు సంబంధం లేని ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు. ఇంకొందరు జర్నలిస్టులు మాత్రం ట్విట్టర్ వేదిక కొన్ని విషయాలను రివిల్ చేసి ఏదో కనిపెట్టిన సైంటిస్టుల ఫీలవుతుంటారు.

ఇలా మొదలయింది

ఇకపోతే రీసెంట్ గా ఒక ప్రముఖ జర్నలిస్ట్ మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించిన బిజినెస్ డీటెయిల్స్ ను ట్విట్టర్ వేదిక షేర్ చేశాడు. మామూలుగా కొన్ని సినిమాలకు సంబంధించి ఏ సినిమా ఎన్ని కోట్లకు అమ్ముడు పోయింది. డిజిటల్ రైట్స్ ఎవరికి అమ్మారు, ఏ ఏరియాలో ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటూ ఈ జర్నలిస్ట్ ఎప్పుడు పడితే అప్పుడు సినిమాల గురించి పోస్ట్లు వేస్తూ ఉంటాడు. ఇక ఇద్దరి మధ్య జరిగే పరస్పరం ఒప్పందాన్ని మిస్టర్ బచ్చన్ విషయంలో ట్విట్టర్ వేదికగా బయటపెట్టాడు. మామూలుగా హరీష్ శంకర్ కి దిల్ రాజు కి మంచి బాండింగ్ ఉంది నైజాం ఏరియాలో మిస్టర్ బచ్చన్ రిలీజ్ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ తరుణంలో నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ మిస్టర్ బచ్చన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అంటూ ఒక విషయాన్ని జర్నలిస్ట్ బయట పెట్టేసాడు. ఇక్కడతో వీరి మధ్య ట్వీట్స్ యుద్ధం మొదలైంది.

టీజీ విశ్వ ప్రసాద్ స్పందన

ఇది షేర్ చేసిన కొద్దిసేపటికి నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, మా సంస్థ ఎప్పుడు బిజినెస్ డీటెయిల్స్ ను ప్రైవేట్ గా ఉంచుతుంది అని. కానీ కొంతమంది ఆత్రుత ఉన్న సో కాల్డ్ జర్నలిస్టులు బిజినెస్ డీటెయిల్స్ షేర్ చేస్తారు అంటూ తనదైన శైలిలో మాట్లాడారు. దీనికి ఆ జర్నలిస్ట్ స్పందిస్తూ ఇకపై మీరు చెప్పిన మాటలు మనసులో పెట్టుకొని ప్రవర్తిస్తాను. మీరు మంచి పద్ధతిలో చెప్పారు అంటూ ప్రొడ్యూసర్ ను కాకా పట్టడం మొదలు పెట్టాడు.

- Advertisement -

Mr. Bachchan

నేను వేసిన ట్వీట్ లో తప్పేముంది

ఇకపోతే ఈ ట్వీట్ పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించాడు. మీకు ఇంటర్వ్యూ ఇద్దామనుకుంటున్నాను పాడు చేసుకోకండి అంటూ రియాక్ట్ అయ్యాడు. ఇది నా రిక్వెస్ట్ అని కూడా మాట్లాడారు. దానికి ఆ జర్నలిస్ట్ నేను మీ ఇంటర్వ్యూ అడగలేదు. మీరే ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పారట అంటూ, అయినా నేను వేసిన ట్వీట్ లో తప్పే ముంది వార్తలు సేకరించటం నా వృత్తి అంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు. దీనిపై హరీష్ స్పందిస్తూ మీకు ఎప్పుడో ఇంటర్వ్యూ ఇస్తాను అని నేను ఇవ్వలేదట సో మా వాళ్ళు అడిగినప్పుడు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను అంటూ చెప్పాను. అంటూ హరీష్ సమాధానమిచ్చాడు.

నేను Director కాబట్టి ఇంకా మర్యాదగా మాట్లాడుతున్న

ఇక పోతే …. గతం లో “భవదీయుడు భగత్ సింగ్ “ టైటిల్ లీక్ చేసిన మీరు తప్పు ,ఒప్పు అంటూ డిస్కషన్ పెట్టకండి … మీకు సూట్ అవ్వదు. కేవలం మీ సోషల్ మీడియా పరపతి పెంచుకోడానికి డీటెయిల్స్ లీక్ చేసి దాని తాలూకా అఫీషియల్ అప్డేట్ ఫ్రమ్ ప్రొడక్షన్ హౌస్ ఫన్ కిల్ చేసే మీలాంటి వాళ్లు తప్పొప్పులు మాట్లాడటం చూస్తే నవ్వొస్తుంది. నేను Director కాబట్టి ఇంకా మర్యాదగా మాట్లాడుతున్న, అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు