Mr.Bachchan : హరీష్ ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాడు.. అదే సినిమాకు ప్లస్..

Mr.Bachchan : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రవితేజ ఫ్యాన్స్ కోరిక నేర వేరింది. రవితేజ లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ మూవీ మొదటి షోతోనే మంచి టాక్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో మూవీ దూసుకుపోతుంది. ఆగస్టు 14 సాయంత్రం నుంచే అనేక చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. మిస్టర్ బచ్చన్‌ సినిమా బాలీవుడ్ అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా ప్రస్తుతం ఎలాంటి టాక్ తో దూసుకుపోతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ప్రతి సినిమాలో తన మార్క్ ను చూపిస్తూ వస్తున్నాడు హరీష్ శంకర్. ఈయన రీమేక్ లు తీసినా వాటిని బాగా తీస్తాడు అనే పేరు ఉంది. దీంతో హిందీలో రైడ్ సీరియస్ సబ్జెక్టు అయినా దానిని హరీష్ శంకర్ తన స్టైల్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో చూపిస్తాడు అనుకున్నారు. కానీ సినిమాలో మెయిన్ పాయింట్ రైడ్ అయితే దాన్ని వదిలేసి దాని చుట్టూ పాటలు, ఫైట్స్, లవ్ స్టోరీ రాసుకున్నాడు. అది కాస్త ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఉన్నంత సెకండ్ ఆఫ్ కథ లేదు. అక్కడక్కడా హరీష్ తడబడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Mr.Bachchan movie got mixed response in theatres

- Advertisement -

మిస్టర్ బచ్చన్ ప్లస్ పాయింట్స్..

ఇక రవితేజ ఏ సినిమాకైనా చాలా కష్టపడతాడని తెలిసిందే.ఈ సినిమాకి కూడా తన ఎనర్జీని అంతా పెట్టి ఫుల్ యాక్టివ్ గా నటించాడు. భాగ్యశ్రీ భోర్సే మాత్రం తన అందంతో, అభినయంతో బాగానే ఆకట్టుకుంది. సినిమాకు ప్లస్ పాయింట్ అంటే రవితేజ ఒన్ మ్యాన్ షో అవ్వడమే.. మ్యూజిక్, సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. కథ రొటీన్ గా అనిపించినా బోర్ కొట్టకుండా బాగానే ఆకట్టుకుంది..

హరీష్ లాజిక్ మిస్ అయ్యింది..

కథ బాలీవుడ్ సినిమాది తీసుకున్నా కథనం మాత్రం చాలా రెగ్యులర్ రొటీన్ మాస్ మసాలా సినిమాలా రాసుకున్నారు. దర్శకత్వం పరంగా హరీష్ శంకర్ బాగానే తీసినా తన రీమేక్ మార్క్ ఎక్కడో మిస్ అయిందనిపిస్తుంది. ఇంకాస్త బాగా తీయ్యొచ్చు. ఏది ఏమైనా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది.. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు