Mr Bachchan: మిక్కీ జే మేయర్ నుంచి అలా రాబట్టడం హరీష్ శంకర్ కి మాత్రమే సాధ్యమైంది

Mr Bachchan:తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో మిక్కి జే మేయర్ ఒకరు. మిక్కి జే మేయర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మిక్కి జే మేయర్ మ్యూజిక్ లో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఒక పాటను స్లో పాయిజన్ లా ప్రేక్షకులకు ఎక్కిస్తూ ఉంటాడు. మిక్కీ చేసిన అన్ని పాటలు మాక్సిమం హిట్ అయ్యాయి. మిక్కి కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఉన్నాయి. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమా కూడా సంగీతం అందించారు. ఆ సినిమాలో ప్రతి పాట దేనికి అది ప్రత్యేకమని చెప్పొచ్చు. ఒక పిరియాడిక్ సినిమా అయినా, మోడ్రన్ లవ్ స్టోరీ అయినా, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా అయినా కూడా ఆ సినిమాకి తన మ్యూజిక్ తో న్యాయం చేస్తాడు మిక్కి.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులతో మిక్కి జె మేయర్ కి మంచి అనుబంధం ఉంది. కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాకి మిక్కి అందించిన మ్యూజిక్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఆ సినిమా తర్వాత నారప్ప సినిమా మినహాయిస్తే ఇప్పటివరకు శ్రీకాంత్ అడ్డాల చేసిన ప్రతి సినిమాకి మిక్కి మాత్రమే సంగీతం అందించాడు. అలానే హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గద్దలకొండ గణేష్ అనే సినిమాకు మిక్కి సంగీతం అందించాడు.

Mickey J Meyer

- Advertisement -

మిక్కీ పాటలన్నీ కూడా వినసొంపుగా ఉంటాయి. మిక్కీ కెరియర్ లో ఫాస్ట్ బీట్ సాంగ్స్ తీసుకుంటే కేవలం 5,6 మాత్రమే ఉంటాయి. అ ఆ సినిమాలో వెల్లిపోకే శ్యామల. గద్దల కొండ గణేష్ సినిమాలు “వక్క వక్క” ఇలా కొన్ని సాంగ్స్ ను చెప్పొచ్చు. అయితే మాస్ బీట్ సాంగ్స్ మిక్కీ చేయలేడు అనుకుంటే పొరపాటు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఏ రకమైన పాటనైనా కంపోజ్ చేయగలుగుతాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హరీష్ శంకర్ తో చేసిన రెండు సినిమాలు. ఇక రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోతోనే సాంగ్ ఎలా ఉండబోతుందో అర్థం అవుతుంది. ఈ సాంగ్ కూడా చాలా ఇన్స్టెంట్గా ఎక్కుతుంది. ఏదైనా మిక్కితో ఇలా ఫాస్ట్ బీట్ సాంగ్స్ రాబట్టడం అనేది హరీష్ శంకర్ కు మాత్రమే చెల్లింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు