Mr Bachchan: రవితేజ గారు దయచేసి హీరోగా సినిమాలు ఆపేయండి, టూ మచ్ ట్రోలింగ్

Mr Bachchan: అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేస్తూ, సింధూరం సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు రవితేజ. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోస్ తో కూడా కలిసి నటించాడు. అయితే కొన్నేళ్ల తర్వాత రవితేజ హీరోగా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వంటి సినిమాలు రవితేజ కెరీర్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా మారాయి. ఇప్పటికి రవితేజ హీరోగా సినిమాలు చేస్తున్నారు.

అయితే రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా అనేది కొంతమందికి ఎంతలా ఉపయోగపడుతుందో, ఇంకొంతమందిని ట్రోల్ చేయడానికి సినిమాను కిల్ చేయడానికి కూడా అంతే ఉపయోగపడుతుంది అని చెప్పాలి. చాలామంది సెలబ్రిటీలను పర్సనల్ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది నెటిజన్స్ కొందరు ఎవరికి అనిపించినా ఒపీనియన్స్ను వాళ్లు చెబుతూ ఉంటారు. అయితే రీసెంట్ గానే మిస్టర్ బచ్చన్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఈ ట్రైలర్ ని పొగుడుతుంటే మరికొంతమంది మాత్రం హీరోగా ఎన్ని రోజులని సినిమాలు చేస్తారు. ఇలా చూస్తుంటే చాలామందికి బోర్ కొట్టేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ సినిమాలు చేయండి అంటే కొంతమంది మాస్ మహారాజ్ ను అనడం మొదలుపెట్టారు.

ఇకపోతే హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్లో మొదటి షాక్ అనే సినిమా వచ్చింది. సినిమా టైటిల్ లాగానే రిజల్ట్ కూడా షాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ మళ్లీ రచయితగా పనులు మొదలుపెట్టాడు. ఎన్నో ప్రయత్నాలు జరిగిన తర్వాత మళ్లీ రవితేజ మిరపకాయ్ సినిమాతో మరో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి బ్లాక్ బస్టర్ సాధించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతోనే దర్శకుడుగా ఇండస్ట్రీలో నిలబడిపోయాడు హరీష్ శంకర్.

- Advertisement -

Ravi Teja

అయితే వీరి కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా పై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే రిలీజ్ అయిన మూడు పాటలుకు కూడా మంచి ఆదరణ లభించింది. ఈ మూడు పాటలను సంగీత దర్శకుడు మిక్కిజే మేయర్ అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు