Mr Bachchan: పాఠ్య పుస్తకాల్లో దాచుకున్న పాటల పుస్తకాలు గుర్తుచేసారు

Mr Bachchan: రోజులు మారుతున్న కొద్దీ చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు అప్పటి జ్ఞాపకాలు, అనుభూతులు బాగున్నాయి అనే ఆలోచనలు అప్పుడప్పుడు మదిలో తిరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు సినిమాను వెతుక్కుంటూ ఆడియన్స్ వెళ్లేవాళ్లు. ఎన్నో మినీ యుద్ధాలు చేసిన తర్వాత ఆ సినిమా టికెట్ దొరికి థియేటర్లో కూర్చొని మన అభిమాన నటుడు సినిమా చూసినప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇప్పుడైతే బుక్ మై షో వంటి యాప్స్ వచ్చేసి టికెట్లు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. కానీ ఒకప్పుడు టికెట్ దొరకడం అనేది అచీవ్మెంట్ అని చెప్పాలి.

మెగాస్టార్ చిరంజీవి వంటి హీరో సినిమాకి ఫస్ట్ డే టికెట్ దొరకాలి అంటేనే ఒక అదృష్టం ఉండాలి. అందుకే జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ మెగాస్టార్ సినిమాకి ఫస్ట్ డే టికెట్ దొరికినట్టు మనకు రేర్ గా ఒక రాడ్ దొరుకుతుంది అని ఒక ఫైట్ లో చెబుతాడు. అలానే ఒక సినిమాను చూసి ఆ సినిమా గురించి బయటకు వచ్చి అప్పట్లో చాలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒక సినిమాను చూసి వచ్చినవాడు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో హీరోలా కనిపిస్తూ ఉండేవాడు. వాడు ఆ కథను చెబుతూ ఉంటే అందరూ వింటూ ఉండేవాళ్ళు. అప్పుడు మొదటి సినిమా చూసిన వాడే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో డైరెక్టర్ల ఫీల్ అవుతూ స్టోరీ చెప్పేవాడు.

ఇకపోతే కొన్ని రోజుల తర్వాత వీసీడీలు రావడం మొదలయ్యాయి. ఒక సినిమా కొన్ని రోజుల తర్వాత డివిడి రూపంలో ఇంటికి తెచ్చుకునే వాళ్ళం. మళ్లీ మళ్లీ ఆ సిడి అరిగిపోయేంతవరకు చూసేవాళ్ళం. ఇకపోతే సీరియల్ కంటే ముందు సినిమా పాటల నచ్చితే ఆ క్యాసెట్లు కొనుక్కొని వాక్మెన్ లో పెట్టుకొని వినేవాళ్ళం. ఆ తర్వాత మొబైల్స్ వచ్చాక మెమరీ కార్డులో వినడం మొదలుపెట్టాం. ఇక ప్రస్తుతం మ్యూజిక్ కి కూడా కొన్ని యాప్స్ వచ్చేసాయి. ప్రస్తుతం వాటిలో మ్యూజిక్ వింటున్నాం.

- Advertisement -

Mr Bachchan 1st Song|

ఆ అనుభూతి మరోసారి

కానీ టెక్నాలజీ అంటూ ఏమీ లేనప్పుడు ఎక్కడో ఒక పాటను వినడం, ఆ పాటను నేర్చుకోవాలనే తపన, ఆ పాటను పాడేయాలి అని ఆరాటం ఉన్న రోజుల్లో ఏకైక ఆదరణ పాటల పుస్తకం. కేవలం ఒక రూపాయికి దొరికే పాటల పుస్తకంలో ఆరు పాటలు ఉండేవి. పాఠ్యపుస్తకంలో దాచుకొని చదువుకున్న ఆ పాటలు ఇప్పటికే ఒక గొప్ప అనుభూతి. అలాంటి అనుభూతిని మరోసారి గుర్తుచేస్తుంది మిస్టర్ బచ్చన్ మూవీ టీం. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి రీసెంట్ గా సితార్ అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ప్రస్తుతం ఒక పాటకు సంబంధించి లిరిక్స్ కావాలి అని అంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు ఈ సినిమా టీం పాత రోజులులా పాటను ఓ కాగితంపై ప్రచురిస్తుంది. చాలామందికి ఇది ఒక నోస్ట్రాలజీయా ఫీల్ అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు