Mrunal Thakur: ఆ భారీ ప్రాజెక్ట్‌ కు ఒకే చెప్పిన మృణాల్‌ !

 

Mrunal Thakur: మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు కొదువ లేదు. పుట్టగొడుగుల్లాగా హీరోయిన్లు పుట్టుకు వస్తున్నారు. తెలుగు హీరోయిన్లు చాలదు అన్నట్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది హీరోయిన్లు తెలుగులోకి వచ్చే సెటిల్ అవుతున్నారు. అలాంటి హీరోయిన్లలో మృణాల్‌ ఠాగూర్ ఒకరు. హీరోయిన్ మృణాల్‌ ఠాగూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ బ్యూటీ మృణాల్‌ ఠాగూర్… మహారాష్ట్రలో పుట్టి పెరిగి… బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసి సక్సెస్ అయింది. మొట్టమొదటగా మరాఠీ సినిమాలలో కనిపించిన… హీరోయిన్ మృణాల్‌ ఠాగూర్… ఆ తర్వాత 2018 సంవత్సరంలో లవ్ సోనియా అనే సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసి 2022 సంవత్సరంలో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది.

- Advertisement -

సీతారామం సినిమాలో సీత పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది మృణాల్‌ ఠాగూర్. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో… తెలుగులో వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. ఈ తరుణంలోనే ఇటీవల ఫ్యామిలీ స్టార్, హాయ్ నాన్న లాంటి సినిమాలు చేసింది. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తే అక్కడ కూడా నటిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో హీరోయిన్ మృణాల్‌ ఠాగూర్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చింది.

పాపులర్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ చేస్తున్న సినిమాలో ఛాన్స్ దక్కించుకుందట ఈ బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో మామ్ అనే సినిమా వస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. దీనికి మృణాల్‌ ఠాకూర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కాగా ఈ సినిమాలో సిద్ధార్థ చతుర్వది హీరోగా చేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు