Mrunal Thakur: రాఘవ లారెన్స్ సరసన కాంఛనలో కనిపించనున్న సీత.?

Mrunal Thakur: తెలుగు సినిమాలలో కొన్నిటికి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలా గౌతమ్ దర్శకత్వంలో నాని చేసిన సినిమా జెర్సీ. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమా కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇప్పటికీ నాని కెరీర్ లో బెస్ట్ ఫిలిం అంటే జెర్సీ అని చెప్పొచ్చు. అంతా అద్భుతంగా ఈ సినిమాలో నాని పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇదే సినిమాను హిందీలో కూడా తీసాడు గౌతమ్. కానీ ఈ సినిమా అక్కడ ఊహించిన విజయాన్ని సాధించుకోలేదు.

Mrunal Thakur

గౌతమ్ హిందీలో దర్శకత్వం వహించిన జెర్సీ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది మృణాల్. అయితే ఆ సినిమా అక్కడ ఊహించిన విజయాన్ని సాధించకపోవడంతో దాదాపు తన కెరీర్ అయిపోయింది అని అనుకున్నారు చాలామంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారాం సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ సినిమాలో సీత అనే పాత్రలో కనిపించింది మృణాల్. ఈ సినిమా హిట్ అయిన తర్వాత మృణాల్ వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగులో హాయ్ నాన్న ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాల్లో కనిపించింది.

- Advertisement -

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రాబోతున్న కాంచన 4 సినిమాలో మృణాళ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంచన సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇప్పటికీ మూడు పార్ట్స్ లో వచ్చింది. ప్రతిదీ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు కాంచన 4 సినిమా పైన కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మృణాల్ నటిస్తుంది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన మృణాల్ ఇవ్వాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు