JanhviKapoor : జాన్విని ట్రోల్ చేస్తున్న ఆ స్టార్ క్రికెటర్ల ఫ్యాన్స్.. ఒక్క మాటపై ఉండవా అంటూ..

JanhviKapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. అతిలోకసుందరి శ్రీదేవి – నిర్మాత బోణి కపూర్ ల గారాల కూతురుగా ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త్వరలో టాలీవుడ్ ని ఏలడానికి రెడీ అవుతుందని తెలిసిందే. ఇక్కడ ఏకంగా రెండు పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయింది. ఎన్టీఆర్ తో ఆల్రెడీ దేవరలో నటిస్తుండగా, ఈ సినిమా మరో మూడు వారాల్లో సెప్టెంబర్ 27న రిలీజ్ కి రెడీ అవుతుంది. అలాగే త్వరలో రామ్ చరణ్ (Ramcharan) RC16 సెట్స్ లో కూడా అడుగుపెట్టనుంది. ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ పై లేటెస్ట్ గా నెట్టింట ట్రోలింగ్ నడుస్తుంది. అది కూడా సినిమాల గురించి కాదు. ఇండియాలో బీహార్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ క్రికెటర్ల ఫ్యాన్స్ జాన్వీ కపూర్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

MS Dhoni and Virat Kohli fans trolling on Janhvi Kapoor

ఆ స్టార్ క్రికెటర్ల ఫ్యాన్స్ ట్రోలింగ్..

ఇదిలా ఉండగా తాజాగా జాన్వీ కపూర్ (Janhvi kapoor) తాజాగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు ఇండియన్ స్టార్ క్రికెటర్ల ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంది. నెట్టింట జాన్వీ కపూర్ న కొందరు క్రికెటర్ల అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే… తాజాగా జాన్వీ కపూర్ కొన్ని ఇంటర్వ్యూ లలో జాన్వీ కపూర్ ని నీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరూ అంటే.. “MS ధోని” (MS Dhoni) అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వెంటనే మరో ఇంటర్వ్యూ లో “రోహిత్ శర్మ” (Rohith Sharma) కు చాలా పెద్ద ఫ్యాన్ అని జాన్వీ అంది. ఇంతలో మరో షో లో తాను “విరాట్ కోహ్లీ” (Virat Kohli) కి డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో ఆ ముగ్గురు క్రికెటర్ల అభిమానులు జాన్వీ కపూర్ ని ట్రోల్ చేస్తున్నారు. ఒక్క మాటపై నిలబడవా జాన్వీ… అంటూ నెట్టింట ఫైర్ అవుతున్నారు. చిత్రమేమిటంటే ఈ అన్ని ఇంటర్వ్యూలలో జాన్వీ కపూర్ ఒకేరోజు పాల్గొనడం జరిగింది.

- Advertisement -

ప్రమోషన్లలో బిజీ అయిన జాన్వీ..

ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ నటించిన దేవర నుండి తాజాగా మూడో సాంగ్ రిలీజ్ చేయగా, జాన్వీ తారక్ (Jr NTR) తో పోటీ పడి డాన్స్ చేసింది. ఇక ఇప్పట్నుంచే దేవర కోసం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రెడీ అయింది జాన్వీ. తారక్ తో కలిసి పాతిక ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇదిలా ఉండగా రామ్ చరణ్ తో నటించబోయే RC16 ప్రాజెక్ట్ లో అక్టోబర్ లో అడుగుపెట్టనుందని సమాచారం. అయితే ఈ రెండు సినిమాల్లో కూడా జాన్వీ కపూర్ పల్లెటూరి అమ్మాయిలాగానే కనిపించనుందని తెలుస్తుంది. దేవర గనుక క్లిక్ అయితే టాలీవుడ్ లో జాన్వీ కపూర్ చక్రం తిప్పడం ఖాయమని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు