Greatest Of AllTime : ఆ స్టార్ క్రికెటర్ ఫ్యాన్స్ కి గోట్ నచ్చేలా ఉంది.. ఎందుకంటే?

GreatestOfAllTime : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటించిన “ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం” సినిమా ఈరోజు, అనగా సెప్టెంబర్ 5న రిలీజ్ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కావడం జరిగింది. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూడడం జరిగింది. ఇక అర్ధరాత్రి నుండే థియేటర్ల వద్ద విజయ్ అభిమానుల సందడి మొదలవగా, తమిళనాట అయితే విజయ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో గోట్ (GratestOfAllTime) మ్యానియాతో ఊగిపోతున్నారు. అయితే గోట్ సినిమాకు థియేటర్లలో మిక్సడ్ టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా గొట్ సినిమాలో పలువురు స్టార్స్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ గా నిలిచిపోయింది.

MS Dhoni reference in Greatest Of AllTime movie

గోట్ లో ధోని రిఫరెన్స్.. బాగానే ప్లాన్ చేసారు..

ఇక కాసేపటికిందే రిలీజ్ అయిన గోట్ సినిమా థియేటర్లలో మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇదిలా ఉండగా గోట్ సినిమాలో ఓ స్టార్ క్రికెటర్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా నచ్చేలా ఉందని సమాచారం. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు. లెజెండరీ క్రికెట్ కెప్టెన్ “మహేంద్ర సింగ్ ధోని”. అవును.. గోట్ సినిమాలో మహేంద్ర సింగ్ ధోని రిఫరెన్స్ ఓ సీన్ లో పేలిపోయేలా ఉందట. CSK టీమ్ ని, MS ధోనీ గురించి ఓ సీన్ ని అద్భుతంగా రాసుకున్నారని, సినిమాలో ఓ ఫైట్ సీన్ జరుగుతుంటే ధోని ఎలివేషన్ సీన్ వస్తుందని సమాచారం. ఆ సీన్ కి థియేటర్లో మంచి స్పందన వస్తుందని సమాచారం. ఈ సీన్ ఎమ్మెస్ ధోనికి మంచి గూస్బంప్స్ ఫీలింగ్ ఇస్తుందని టాక్. ఇక తమిళనాట ధోనికి గుడికట్టేసే రేంజ్ లో అభిమానులుంటారని తెలిసిందే. ఇక ఈ సినిమాలో ధోనీ రిఫరెన్స్ సీన్ లు అభిమానులకు బాగా నచ్చవచ్చని సమాచారం.

- Advertisement -

కెప్టెన్ కి కూడా మంచి ట్రిబ్యూట్..

ఇక అలాగే ఈ సినిమాలో ధోనీ రిఫరెన్స్ తో పాటు, కెప్టెన్ విజయ్ కాంత్ స్పెషల్ అప్పీరెన్స్ ని కూడా చూపించారట. AI టెక్నాలజీని వాడి కెప్టెన్ ని మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై చూపించగా, అయన అభిమానులకు కూడా ఈ సినిమా బాగా నచ్చే ఛాన్స్ ఉంది. అయితే సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకున్న ఈ నేపథ్యంలో ఈ స్టార్స్ రిఫరెన్స్ సినిమాకి బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక తొలిరోజు గోట్ భారీ ఓపెనింగ్స్ సాధించే ఛాన్స్ ఉంది. అయితే ఈ చిత్రానికి సంగీతం, పాటల ప్లేస్‌మెంట్ పెద్ద మైనస్ అని టాక్ వినిపిస్తుంది. యువన్ బీజీఎమ్ బాగానే ఉన్నా, కొత్తగా ఏం లేదని టాక్. మరి థియేటర్ల వద్ద ప్రేక్షకుల్ని గోట్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు