Mukku Avinash: ఆ కష్టాలు చెప్పుకోలేనివి.. ముక్కు అవినాష్ ఎమోషనల్ కామెంట్స్..!

Mukku Avinash..తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న షో లలో జబర్దస్త్ షో కూడా ఒకటి.. ఈ షో నుంచి ఎంతోమంది యాంకర్స్ తెలుగు తెరకు పరిచయం అవ్వడమే కాకుండా హీరోలు, కమెడియన్స్, డైరెక్టర్లు కూడా పరిచయమయ్యారు.. అలా జబర్దస్త్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు.. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.. ఇలాంటి క్రేజ్ తో బిగ్ బాస్ లో కూడా అవకాశం సంపాదించుకున్నారు. ప్రస్తుతం స్టార్ మా చానల్లో నీతోనే డాన్స్ షోలో డాన్స్ చేస్తూ ఉన్నారు అవినాష్.

కిరాణా షాపులో పనిచేసే వాడిని..

Mukku Avinash: The hardships are unspeakable.. Mukku Avinash's emotional comments..!
Mukku Avinash: The hardships are unspeakable.. Mukku Avinash’s emotional comments..!

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అవినాష్ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను వెల్లడించారు.. ముఖ్యంగా చిన్న వయసు నుంచే తాను హాస్టల్ లో ఎక్కువగా చదువుకొని పెరిగానని తెలిపారు. తను బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశానని తెలిపారు.. తన తండ్రి బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లో డ్రైవర్ అని.. అమితాబ్ బచ్చన్ ను కూడా డ్రాప్ చేసేవారని తెలిపారు అవినాష్.. తన కుటుంబం కూడా పేద కుటుంబమని దీంతో ఇల్లు గడవడం కోసం కిరాణా షాపులలో కూడా పనిచేశానని తెలియజేశారు. అలాగే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీ బాయ్గా కూడా పనిచేశానని తెలియజేశారు.

సినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు..

చదువుకునే రోజులలో తన కుటుంబాన్ని కేవలం ఎగ్జామ్ ఫీజుకి తప్ప మిగతా అవసరాల కోసం డబ్బులను అడిగే వాడిని కాదని.. తనకి కాలేజీకి వెళ్లడం కంటే ఎక్కువగా సినిమాలలోకి రావాలనే కోరిక ఎక్కువగా ఉండేదని అందుకే సినిమా ఆఫీసుల చుట్టూ ఎక్కువగా తిరిగే వాడినని వెల్లడించారు. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన కెరీర్ మారిపోయిందని టీం లీడర్ అయ్యాక మరింత పేరు వచ్చిందని తెలిపారు అవినాష్. జబర్దస్త్ లో చాలానే రాజకీయాలు ఉన్నాయని కానీ ఎప్పుడు వాటి జోలికి వెళ్లలేదని తెలిపారు అవినాష్.

- Advertisement -

జబర్దస్త్ వల్లే ఈ స్థాయికి..

జబర్దస్త్ అనే బ్రాండ్ ను ఉపయోగించి విదేశాలకు వెళ్లి ఈవెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. జబర్దస్త్ వల్ల ఎవరికి పెద్దగా లాభాలు ఉండవని.. కేవలం బయట షోల వల్ల వచ్చే వాటితోనే లాభాలు ఉంటాయని తెలిపారు.. తాను చదువుకుంటున్న రోజుల్లో సరైన తిండి లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నామని కూడా తెలిపారు.. కొన్ని సందర్భాలలో సినిమాలు చూడాలంటే గోడ దూకి వెళ్లి మరీ థియేటర్ లోపల కూర్చొని సినిమాలు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయని వెల్లడించారు అవినాష్. తనకు బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చినప్పుడు శ్రీముఖితో మంచి స్నేహబంధం ఉందని ఆమె తనకు ఎన్నోసార్లు సహాయం కూడా చేసిందని .. అది ఎప్పటికీ మరిచిపోలేనిది అని తెలిపారు అవినాష్. మొత్తానికైతే తాను పడ్డ కష్టాల గురించి మరొకసారి మీడియాతో చెప్పుకొని అందరిని ఆశ్చర్యపరిచారు ముక్కు అవినాష్ ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం శ్రీముఖితో కలిసి మా పరివారం షో లో సందడి చేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు