Mullapudi Venkataramana Death Anniversary : రమణీయ రచయిత.. ముళ్ళపూడి వెంకట రమణ

ముళ్ళపూడి వెంకట రమణ.. ఈ పేరు వింటే ఈ జెనరేషన్ ఆడియన్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు. ఒక్కసారి 90ల్లో వ్యక్తులకి అడిగితే ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంటుందని అంటారు. ప్రముఖ లెజెండరీ దర్శకుడైన బాపు ఆయన తీసే చిత్రాలకు తెర వెనక ఉండి తన రచనా శైలితో రక్తి కట్టించే వారు. 80 ల కాలంలో ప్రసిద్ధ నవలా, కథా, హాస్య రచయిత అయిన ముళ్ళపూడి వెంకట రమణ గురించి చెప్పాలంటే, ఆయనలో నవలా రచయిత, కథా రచయిత, సినీ మాటల రచయిత, హాస్య కథా రచయిత, అన్నిటికి మించి ఒక వ్యక్తిత్వంలో ఉన్నతమైన మనిషి. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి వెంకట రమణ(24 ఫిబ్రవరి 2011) వర్థంతి నేడు. ఈ సందర్బంగా ఆయన గురించి కొన్ని విశేషాల్ని గుర్తు చేసుకుందాం..

రమణ స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి. ఇండస్ట్రీ లో స్నేహమంటే ముందుగా చెప్పుకునేది బాపు రమణ ల గురించే.. ఈ త్రయం లోనే తెలుగు సినిమా గర్వించదగ్గ చిత్రాలొచ్చాయి. బాపు తీసే ప్రతీ చిత్రంలో ఆయన సృష్టించే పాత్రకి బాపు కుంచె ప్రాణం పోస్తే, ఆయన దర్శకత్వం వహించే ప్రతి సినిమాకి రమణ మాటలు జీవకళను తీసుకొస్తాయి. అలాంటిది రమణ రచనా శైలి. అయితే రమణ ఎక్కువగా హాస్య రచనలకు పెట్టింది పేరుగా నిలిచారు. 1956 లో రచించిన బుడుగు నవల ద్వారా గుర్తింపు పొందిన రచన ‘గిరీశం లెక్చర్లు’ పుస్తకం తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు రమణ. ఇక పదేళ్ల కిందట స్వాతి పత్రికలో ప్రచురించిన ఆయన ఆత్మకథ నుండి రాసిన కోతి కొమ్మచ్చి తో ఈ తరం జనాలకి మరింత చేరువ అయ్యారు.

ఇక సినిమా వరకూ వస్తే రమణ ప్రయాణమంతా బాపుతోనే. బాపు తీస్తే ప్రతి చిత్రానికి ఏదో ఒక విధంగా రమణసాయం ఉండే ఉంటుంది. కొన్ని చిత్రాలకు ఆయన మాటలు రాయకపోయినా, బాపు ఏదో ఒక విభాగంలో రమణ రచనా సాయం తీసుకునే వారు. బాపు మొట్ట మొదటి సినిమా ‘సాక్షి’ మొదలుకొని పంచదార చిలక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళిపుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం చివరగా శ్రీ రామరాజ్యం వరకూ వీరి రచన సాగింది. రమణ శివైక్యం చెందాక బాపు కూడా సినిమాలు తీయడం ఆపేసారు.

- Advertisement -

ఇక రమణ వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే ఇండస్ట్రీలో చాలా మంది ఆయన్ని అనుసరించేవారు. ప్రముఖ నటుడు రచయిత నటుడు అయిన అయిన రావి కొండల రావు రమణ గొప్పదనం గురించి ఓ సందర్భాన్ని ఇలా చెప్పుకొచ్చారు..

అప్పుడు అందాల రాముడు షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ లో ఉన్న నేను ఓసారి షూటింగ్‌లో ప్రొడక్షన్‌ బాయ్‌ని పిలిచి కాఫీ అడిగాను. నేను అడగడం విన్నారు రమణ. ఆ అబ్బాయిని పిలిచి, “ఎవరూ కాఫీ కావాలని అడక్కూడదు. మనమే కాఫీ కావాలా? అని అడుగుతూ ఉండాలి. చిన్నవాళ్లయినా పెద్దవాళ్లయినా సరే వాళ్లుగా అడిగితే మన కంపెనీకి నామోషి” అని బోధ చేశారు. అంటే తన ఆధ్వర్యంలో ఏదైనా షూటింగ్ జరిగితే తనతో ఉన్న వాళ్లందరికీ అన్ని సదుపాయాలను వాళ్ళు ఇబ్బంది పడకుండా ముందే పక్కా ఏర్పాట్లు చేయించేవారు. ఆ తర్వాత రమణ గారు ఏ షూటింగ్ లో ఉన్నా అక్కడ చిత్ర యూనిట్ కి భోజనసదుపాయాల్లో ఎలాంటి ఇబ్బంది రావడం జరగలేదు. ఇక తాను దాదాపు ఐదు వందల సినిమాల్లో పనిచేయగా, ఓ రెండు వందల సినిమాలకి అవుట్ డోర్లు వెళ్లానని, కానీ ‘అందాల రాముడు’ సినిమా అవుట్‌ డోర్ మాత్రం రమణగారితో మహ గొప్ప జ్ఞాపకాల్ని మిగిల్చిందని రావికొండలరావు అన్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు