Chiranjeevi Eye Bank : ‘ఐ బ్యాంక్ కి తన సోద‌రి క‌ళ్లను దానం చేసిన ముర‌ళీ మోహ‌న్ మేక‌ప్ మెన్..

Chiranjeevi Eye Bank : మెగాస్టార్ చిరంజీవి సేవా థృక్పథం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో సినీ రంగంలోనే కాకుండా, ఎంతో మంది ప్రజలకు సేవ చేసారు. ఎన్నో దానాలు చేసి అందరికి ఆప్తుడయ్యారు. ఇప్పటికీ చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎంతో మంది ఇండస్ట్రీలో పలు సేవలు చేస్తూ ఉంటారు. ఇక అన్ని దానాల్లో ఈరోజుల్లో రక్తదానం గొప్ప సేవ అని భావించిన చిరంజీవి బ్లడ్ బ్యాంకు ని కూడా స్థాపించిన విషయం తెలిసిందే. అలాగే ఓమనిషి చనిపోయినపుడు తన చావు వృధా కాకుండా ఎంతో మరొకరి ప్రాణాలు కాపాడాలని ఐ బ్యాంక్ ని కూడా స్థాపించారు.

Murali Mohan's make-up men donate eyes to Chiranjeevi Eye Bank

ఇక దాదాపు పాతికేళ్లుగా ఎంతో మంది ప్రజలు చిరంజీవి బ్లాక్ బ్యాంకు లో రక్తదానం చేస్తుంటారు. అలాగే ఐ బ్యాంక్ కి ఇప్పటికీ కళ్ళు దానం చేస్తుంటారు. తాజాగా చిరంజీవి ‘ఐ సెంటర్’ (Chiranjeevi Eye Bank) కి ఓ వ్యక్తి తన సోద‌రి క‌ళ్లను దానం చేసారు. దీనిపై వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకుకు చెందిన సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ (Murali mohan) యొక్క మేక‌ప్ మ్యాన్ కొల్లి రాము ఎన్నో ఏళ్ల పాటు మురళి మోహన్ పర్సనల్ మేకప్ మెన్ గా పని చేసారు. ఇండస్ట్రీలో కూడా పలువురికి అతను సుపరిచితులు. అయితే కొల్లి రాము యొక్క సోద‌రి ప‌మిడి ముక్క‌ల రాజ్య‌ల‌క్ష్మి మంగ‌ళ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. అయితే ఆమె చనిపోయాక కూడా తన కళ్ళు ఇతరులకు ఉపయోగపడాలని కోరుకుంది.

- Advertisement -

అందుకే ఈ విష‌యాన్ని వారు చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్ కి అందచేయగా, వెంట‌నే వారు స్పందించారు. అలా రాజ్య‌ల‌క్ష్మి తాను చ‌నిపోయిన‌ప్ప‌టికీ నేత్ర‌దానం చేయ‌టం ద్వారా మ‌రో ఇద్ద‌రికీ చూపును అందించి ఎంద‌రికో ఆద‌ర్శ‌ప్రాయంగా మారారు. ఈ సంద‌ర్భంగా ముర‌ళీ మోహ‌న్‌ గారికి, కొల్లి రాముకు అలాగే ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్ వారు ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేశారు. ఇక ఇంతకు ముందు కూడా ఎంతో మంది ఐ బ్యాంకు కు తమ కళ్ళను దానం చేయగా, ప్రతి సంవత్సరం మెగాభిమానులు రక్తదానం చేసి చిరంజీవి బ్లడ్ బ్యాంకు కు పంపిస్తూ ఉంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు