Murari ReRelease : సూపర్ స్టార్ బర్త్ డే స్పెషల్ రెడీ..! కానీ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ దానిపైనే?

Murari ReRelease : టాలీవుడ్ లో స్టార్ హీరోల బర్త్ డే లకు ఆయా హీరోల అభిమానులు ఎంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తారో తెలిసిందే. ఇది ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితీ ల భావిస్తారు. అలాగే ఒక స్టార్ హీరో బర్త్ డే వస్తుందంటే, ఆ రోజున స్పెషల్ టీజర్లు, ఫస్ట్ లుక్స్ రిలీజ్ అప్డేట్ లతో దర్శక నిర్మాతలు కూడా రెడీ గా ఉంటారు. అలాగే ఇప్పుడు స్టార్ హీరోల బర్త్ డే లకు ఆ హీరోలు నటించిన పాత సినిమాల రీ రిలీజ్ లు అవుతుండడం కామన్ అయిపొయింది. టాలీవుడ్ లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ లకు పాకింది. పవన్ కళ్యాణ్ జల్సా, రామ్ చరణ్ ఆరెంజ్, మహేష్ బాబు పోకిరి. ఎన్టీఆర్ సింహాద్రి వారి బర్త్ డేస్ కి రీ రిలీజ్ అయితే, అభిమానులు ఏ రేంజ్ రచ్చ చేసారో తెలిసిందే. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా మహేష్ బర్త్ డే స్పెషల్ గా రీ రిలీజ్ కి రెడీ అవుతుంది.

Murari Movie ReReleasing on Mahesh Babu's Birthday Special

బర్త్ డే ట్రీట్ గా మురారి…

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘మురారి’ ఒకటి. మహేష్ బాబుకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాకుండా, నటన పరంగా మహేష్ ని ఎన్నో మెట్లు ఎక్కించింది. ఇప్పటికి టెలివిజన్ లో మంచి రేటింగ్స్ రాబడుతూ ఉంటుంది ఈ సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. మ్యూజికల్ గానూ పెద్ద హిట్ అయిన ఈ సినిమాలో పెళ్లి పాట, ఇప్పటికీ చాలా మంది పెళ్లిళ్లలో ప్లే చేస్తూ ఉంటారు. సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు మురారి (Murari ReRelease) సినిమాను మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా ఆగష్టు 9న రీ రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

ఫ్యాన్స్ కి మాత్రం ఆ సినిమాయే కావాలట..

అయితే మురారి సినిమాని రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా మహేష్ అభిమానుల డిమాండ్ మాత్రం వేరే సినిమాపై ఉంది. అదే “ఖలేజా”. చాలా రోజుల నుండి ఈ సినిమా రీ రిలీజ్ చేయాలనీ మహేష్ అభిమానులు డిమాండ్ చేషున్నారు. అప్పట్లో ఈ సినిమా ప్లాప్ అయిన టెలివిజన్ లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి బుల్లితెరపై మంచి రేటింగ్స్ రాబడుతూ ఉంటుంది. ఈసారైనా మహేష్ బాబు బర్త్ డే కి ఖలేజా ని రీ రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ అది కుదరట్లేదని, ఖలేజాకి సంబంధించి మంచి ప్రింట్ రెడీ చేస్తున్నారని, మరోసారి ఆ సినిమాని గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తారని సమాచారం. అప్పటిదాకా మహేష్ బాబు ఫ్యాన్స్ మురారి సినిమాతో సంతృప్తి పడక తప్పేట్టు లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు