Mani Sharma: ఆ రేర్ రికార్డు క్రియేట్ చేసిన మణి శర్మ.. తెలిస్తే షాక్..!

దిగ్గజ సంగీత దర్శకుడు మణిశర్మ ఎన్నో వందల అద్భుతమైన పాటలతో ప్రతి హీరోకి మర్చిపోలేని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించి.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు. తన మెలోడీ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించి మెలోడీ బ్రహ్మ గా పేరు దక్కించుకున్న మణిశర్మ.. స్టార్ హీరోలు అందరికీ వాళ్ళ కెరియర్ లో ఎన్నో బెస్ట్ ఆల్బమ్స్ ను అందించారు. కానీ ప్రస్తుతం మణిశర్మ కు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.. పైగా చాలా రేర్ గా తక్కువ సినిమాలు చేస్తూ కెరియర్ ను కొనసాగిస్తున్నారు.. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిశర్మ.. తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మణిశర్మ రెమ్యునరేషన్..
తాజాగా మణిశర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పట్లో మ్యూజిక్ డైరెక్టర్ లకి అంత రెమ్యునరేషన్స్ ఉండేవి కాదు.. కమర్షియల్ సినిమాలు చేసే వాళ్ళకి మాత్రమే కొంచెం ఎక్కువ పారితోషకం ఉండేది.. నా కెరియర్ లో ఇంద్ర సినిమాకి మాత్రమే నేను అందుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్.. ఆ సినిమాకి ఏకంగా కోటి రూపాయలు తీసుకున్నాను.. మ్యూజిక్ డైరెక్టర్స్ లో మొదట కోటి రూపాయలు అందుకున్న డైరెక్టర్ కూడా నేనే.. కెరియర్ స్టార్టింగ్ లో చూడాలని ఉంది సినిమాకి ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు పారితోషకం గా తీసుకున్నాను.. అప్పటి నుంచి కష్టపడి ఎదిగి కోటి రూపాయల వరకు చేరుకున్నాను.. అయితే నేను కోటి రూపాయలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ లకి కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది చాలా సులభం అయింది అంటూ తెలిపారు మణిశర్మ.

ఇంద్ర మ్యూజిక్..
చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమాకి మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ ఎంత ఇచ్చినా తక్కువే అని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.. ఎందుకంటే ఆ సినిమా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ రేంజ్ లో హిట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం అయితే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రతి సినిమాకి కోట్ల లోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇకపోతే 20 ఏళ్ల క్రితమే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏకంగా కోటి రూపాయల పారితోషకం తీసుకొని రికార్డు సృష్టించారని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

- Advertisement -

మణిశర్మ కెరియర్..
యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ మణిశర్మ గా ప్రసిద్ధి పొంది తెలుగు, తమిళ్ సినీ సంగీత దర్శకుడిగా పేరు దక్కించుకొని.. 200 కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఇక ఈయన సంగీతం అందించిన సినిమాలు ముఖ్యంగా 2003లో ఒక్కడు, 1998లో చూడాలని ఉంది అనే సినిమాలకు గానూ ఉత్తమ సంగీత దర్శకుడుగా నంది పురస్కారాలను రెండుసార్లు అందుకున్నారు. అలాగే 3 ఫిలింఫేర్ అవార్డ్ లతో పాటు మూడు మిర్చి మ్యూజిక్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.. ఇక అలా తెలుగు, తమిళ్ చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మణిశర్మ.. ఇప్పుడు అవకాశాలు లేక అడపాదడపా చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ ఉండడం గమనార్హం.. ఏది ఏమైనా ఆయన తిరిగి పూర్వ వైభవాన్ని పొందాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు