Music shop Murthy: మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ రిలీజ్..!

Music shop Murthy: ప్రజెంట్ జనరేషన్ లో కంటెంట్ ఉన్న సినిమాలకి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కుతుంది. అలా ఓ కంటెంట్ బెస్ట్ మూవీ నే ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. ఫ్లై హాయ్ మూవీస్ బ్యానర్ మీద అజయ్ ఘోష్, గామి ఫేమ్ చాందిని చౌదరి లు ప్రధాన పాత్రల్లో మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా లో నటించారు.

ఈ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాను హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ నుంచి తాజాగా ఓ పాటను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా అందరిని ఆకట్టుకున్నాయి.

Music Shop Murthy Movie Rahul Sipliganj Song Release
Music Shop Murthy Movie Rahul Sipliganj Song Release

ఇక త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి అంగ్రేజీ బీట్ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో డీజే ‌ మూర్తి గా అజయ్ గోష్, వేసిన స్టెప్పులు, కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు