HaromHara : సుధీర్ బాబు సినిమా నైజాం రైట్స్ ఆ బడా సంస్థ చేతికి..!

HaromHara : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోలలో సుధీర్ బాబు ఒకరు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా కథ నచ్చితే దానికి ప్రాణం పెట్టేస్తాడు. స్క్రిప్ట్ సెలెక్షన్ల లో కూడా ఎప్పటికప్పుడు కొత్త వేరియషన్లను చూపిస్తాడు. ఇక లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ‘మామ మశ్చీంద్ర’ సినిమాలో కూడా త్రిపాత్రాభినయం తో ఆడియన్స్ ని అలరించాడు. అయితే ఆ సినిమా అంతగా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్ ని తెచ్చుకోలేదు గాని, సుధీర్ బాబు నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఇక లేటెస్ట్ గా సుధీర్ బాబు “హరోం హర” (HaromHara) అంటూ ఒక డిఫరెంట్ కమర్షియల్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ గాని, ట్రైలర్లు గాని ఆకట్టుకున్నాయి. అలాగే సినిమాపై మంచి క్రేజీ అంచనాలను పెంచేసాయి. ఇక జ్ఞానసాగర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సుమంత్ నాయుడు నిర్మించడం జరిగింది.

Mythri Movie Makers acquired the rights of the movie 'Haronhara' Nizam

గన్స్ స్మగ్లింగ్ చేసే రోల్ లో సుధీర్ బాబు..

ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు ఒక కొత్త తరహా పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు ఒక గన్స్ స్మగ్లింగ్ చేసే యువకుడిగా కనించబోతున్నాడు. గన్స్ స్మగ్లింగ్ చేసే స్థాయి నుండి, పలువురు డాన్ రేంజ్ కి ఎలా ఎదిగాడో ఈ సినిమాలో చూపిస్తున్నారని సమాచారం. నార్మల్ గా ఒక సగటు మనిషి లా బతికే హీరో అనుకోని కారణాల వల్ల ఒక పెద్ద స్థాయికి ఈ సినిమాలో ఎదుగుతాడు. ఇలాంటి పాయింట్స్ చూస్తుంటే పుష్ప, ప్రస్థానం, రీసెంట్ గా వచ్చిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఇక సినిమా పై ముందుగా అంచనాలు అంతగా లేకపోయినా “హరోం హర” థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యాక ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని భారీ అంచనాలు పెంచేసింది. ఇక కుప్పం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్ బాబు స్మగ్లర్ గా నటిస్తున్నాడు. ఇక జూన్ 14న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -

మైత్రి చేతికి హరోం హర నైజాం రైట్స్..

ఇక హరోంహర సినిమా నుండి లేటెస్ట్ గా అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం యొక్క నైజాం ఏరియా హక్కులని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు దక్కించుకున్నారు. ఇక గత కొంత కాలంగా వరుసగా డిస్ట్రిబ్యూటర్లు గానూ వరుస సక్సెస్ లు అందుకుంటున్నారు మైత్రి వారు. లాస్ట్ ఇయర్ సలార్ తో భారీ విజయం అందుకోగా, ఈ ఇయర్ ఆరంభం లోనే హనుమాన్ సినిమా తో భారీ లాభాలు అందుకున్నారు. అలాగే మంజుమ్మేల్ బాయ్స్ వంటి డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేసి మంచి లాభాలని అందుకున్నారు. ఇప్పుడుహరోం హర సినిమాతో కూడా ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తారా లేదా చూడాలి. ఇక హరోం హర సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మించగా, ఈ సినిమాలో మాళవిక శర్మ కథానాయికగా నటించింది. 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ చిత్రంకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. ఇక జూన్ 14న సినిమా రిలీజ్ కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు