Tollywood : అన్ని సినిమాలు మాకే కావాలంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి మరి?

Tollywood : టాలీవుడ్ కల్కి2898AD సినిమా తర్వాత మళ్ళీ పెద్ద సినిమాల సందడి లేదన్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఇండియన్2 లాంటి క్రేజీ సినిమాలు వచ్చినా అవి నిరాశ పరిచాయి. ఇక ఈ వారం వచ్చిన సినిమాల్లో రాయన్ ఉన్న దాంట్లో కాస్త బెటర్ గా ఉన్నా, బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ లో అయితే లేదు. అయితే వచ్చే వారం కూడా చిన్న సినిమాల సందడే నెలకొని ఉండగా, ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది మాత్రం ఆగష్టు 15. అవును.. ఆ రోజున ఏకంగా ఐదు క్రేజీ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ఓ మూడు బడా సినిమాలు ఒకే రోజు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

Mythri movie makers got the Nizam rights of Tangalan, Mr. Bachchan

ఈ సినిమాల నైజాం రైట్స్ ఒకే సంస్థ చేతికి?

అయితే ఆగష్టు 15 న రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల్లో తెలుగు సినిమాలు డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ తో పాటు డబ్బింగ్ సినిమా తంగలాన్ కూడా రిలీజ్ అవుతుండగా, ఈ మూడు సినిమాలకు సంబంధించి నైజాం హక్కులను ఒకే సంస్థ దక్కించుకుందట. ఆ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఇండస్ట్రీ లో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటికే తంగలాన్, మిస్టర్ బచ్చన్ సినిమాలు మైత్రి చేతికి రాగా, తాజాగా డబుల్ ఇస్మార్ట్ నైజాం హక్కులని కూడా దక్కించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఆల్మోస్ట్ మైత్రి చేతికే రానున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు కూడా అంటున్నాయి.

- Advertisement -

అన్ని మాకే కావాలంటే ఇబ్బంది తప్పదుగా?

అయితే ఈ మూడు సినిమాలు కూడా ఒకేరోజు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పైగా మూడు సినిమాలపై మంచి హైప్ ఉండగా, అన్ని స్టార్ హీరోల సినిమాలే. కానీ ఒకే రోజు రిలీజ్ అంటే థియేటర్ల సమస్య తప్పని సరి. ఆ మధ్య లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలని మైత్రి వారే నిర్మించగా, ఆ సినిమాలు ఒకే సారి విడుదల కాగా, వాటికి థియేటర్ల సమస్య బాగా వచ్చింది. ఆ టైం లో అభిమానులు ఎంత గొడవ చేసారో తెలిసిందే. ఇక ఈ ఇయర్ వచ్చిన హనుమాన్ సినిమాని మైత్రి వారే డిస్ట్రిబ్యూట్ చేయగా, పోటీగా ఉన్న సినిమాల నుండి థియేటర్లు దక్కించుకోవడం చాలా కష్టమైంది. ఇప్పుడు మళ్ళీ థియేటర్ల సమస్య వస్తుంది. ఒకే రోజు తంగలాన్, మిస్టర్ బచ్చన్ తో పాటు డబుల్ ఇస్మార్ట్ వస్తుండగా, వీటితో పాటు మరో రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి సంక్రాంతికి మైత్రి వారికి వచ్చిన ఇబ్బంది మళ్ళీ రావడం ఖాయం అంటున్నారు. ఇక నెటిజన్లు అయితే అన్ని సినిమాలు మాకే కావాలంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయని అంటున్నారు. మరి ఆరోజు ఏ సినిమాకి ఎన్ని థియేటర్లు సర్దుబాటు చేస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు