Mythri Movie Makers: మామూలు ప్లానింగ్ కాదు ఇది, మైత్రి దిల్ రాజ్ ను తొక్కే ప్రయత్నమా.?

Mythri Movie Makers: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. కొరటాల శివ దర్శకుడుగా శ్రీమంతుడు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతలుగా అడుగుపెట్టారు మైత్రి మూవీ మేకర్స్. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి మంచి లాభాలను తీసుకొచ్చి పెట్టింది. ఈ లాభాలు మరికొన్ని సినిమాలు చేయడానికి ఉపయోగపడ్డాయి. ఈ బ్యానర్ లో వరుసగా హిట్ సినిమాలు వచ్చాయి. సినిమా మీద ప్యాషన్ తో నవీన్ ఎర్నేని, రవి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు.

ప్రస్తుతం ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. సుకుమార్, కొరటాల శివ, హరీష్ శంకర్, బాబి, గోపీచంద్ మలినేని అంటే ఎందరో దర్శకులు ఈ బ్యానర్లో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. ఇక ఈ బ్యానర్ లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీస్ లో పుష్ప ఒకటి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఈ బ్యానర్ కూడా మంచి లాభాలను తీసుకొచ్చి పెట్టింది. అయితే ఈ రోజుల్లో సినిమాను తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయడం కూడా పెద్ద టాస్క్ అయిపోయింది.

ఈ సంస్థ నిర్మించిన సినిమాలు సంక్రాంతికి ఒకేసారి రెండు రిలీజ్ అయ్యాయి. అవి కూడా స్టార్ హీరోలు సినిమాలు కావటం విశేషం. వాల్తేరు వీరయ్య, నరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి సీజన్ కి ఒక రోజు తేడాతో బాక్సాఫీస్ వద్ద పోటీలోకి దిగాయి. అనూహ్యంగా రెండు సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. అయితే ఈ నిర్మాణ సంస్థ తమకు థియేటర్ల ఇబ్బంది రాకూడదు అని డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలు పెట్టింది. చాలా సినిమాలను ఈ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. రీసెంట్ గా విజయసేతుపతి నటించిన మహారాజ సినిమాను కూడా ఈ సంస్థ తెలుగులో రిలీజ్ చేసింది.

- Advertisement -

Buddy (2024)

ఇకపోతే ఇప్పుడు ఈ సంస్థ మూడు తమిళ్ సినిమాలను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గోట్, బడ్డీ, కంగువా సినిమాలను ఈ సంస్థ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి తమిళ్ లో ఎంత భారీ బడ్జెట్ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కేవలం నైజాం ఏరియాలోని దాదాపు 8 కోట్లకు గోట్ సినిమాను కొన్నట్లు తెలుస్తోంది. నైజాం ఏరియా అంటేనే దిల్ రాజు అడ్డా అటువంటిది ఆ ఏరియాలో ఈ సినిమా రైట్స్ కొనడం, అలానే చాలా సినిమాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ సంస్థ కంటే కూడా మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేయడం. ఇవన్నీ కూడా దిల్ రాజుని తొక్కే ప్రయత్నమా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు