Nabha Natesh: సినిమా అంటే బిజినెస్.. యాక్సిడెంట్ తర్వాత రియలైజ్ అయ్యా..!

Nabha Natesh.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్.. ఈ సినిమాతో అటు నిధి అగర్వాల్ , ఇటు నభా నటేష్ హీరోయిన్లుగా ఇద్దరికీ మంచి గుర్తింపు లభించింది.. ఇద్దరికీ సమాన స్థాయిలో ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు.. కానీ నిధి అగర్వాల్ కి అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాకపోయినా.. నభా నటేష్ మాత్రం బాగానే అవకాశాలు దక్కించుకుంది.అయితే ఏం లాభం కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే యాక్సిడెంట్ కి గురై.. దాదాపు 6 నెలలపాటు ఇండస్ట్రీకి దూరమైంది ఈ ముద్దుగుమ్మ. ఇస్మార్ట్ శంకర్ వంటి కమర్షియల్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈమె.. ప్రస్తుతం కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న డార్లింగ్ సినిమాలో ఆయనకు భార్య పాత్రలో నటించబోతోంది.. త్వరలోనే సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన నభా నటేష్ యాక్సిడెంట్ తాలుకా జ్ఞాపకాలను అలాగే యాక్సిడెంట్ కి మునుపు.. తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయింది.. ఆమె రియలైజ్ అయిన అంశాలు ఏమిటి ..?అనే విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చింది.

Nabha Natesh: Cinema means business.. Did it get realized after an accident..!
Nabha Natesh: Cinema means business.. Did it get realized after an accident..!

యాక్సిడెంట్ తర్వాత రియలైజ్ అయ్యా..

నభా నటేష్ మాట్లాడుతూ శ్రీంగేరీ లో నేను పెరిగాను.. కాబట్టి నాకు సాంప్రదాయ నృత్యాలు బాగా తెలుసు.. అక్కడ ప్రాంతమంతా డివోషనల్ తో నిండిపోయింది.. అందుకే నేను కూడా భరతనాట్యం లాంటివి నేర్చుకున్నాను. యాక్సిడెంట్ కాక ముందు వరకు సక్సెస్ కోసం ఎంతో ఆరాటపడేదాన్ని.. అందుకోసం ఎంతో కష్టపడ్డాను.. కానీ యాక్సిడెంట్ తర్వాత రియలైజ్ అయ్యాను.. సినిమా అంటే ఒక బిజినెస్.. అన్ని పాత్రలలో కూడా నటించాలి.. మన ప్రతిభకు పదును పెడితే ..కచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. ఇక కేవలం సక్సెస్ కోసం మాత్రమే ఆరాటపడకుండా అన్ని జానర్లని టచ్ చేస్తూ.. ప్రేక్షకులను మెప్పించే విధంగా పాత్రలను ఎంచుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము… సినిమా అనేది బిజినెస్ కాబట్టి బిజినెస్ తగ్గట్టుగానే మన ఆలోచనలు కూడా ఉండాలి.. ట్రెండుకు తగ్గట్టు ఫాలో అవ్వాలి .. ఆక్సిడెంట్ తర్వాత నేను రియలైజ్ అయిన అంశం ఇదే అంటూ చెప్పుకొచ్చింది నభా నటేష్

ట్రెండుకు తగ్గట్టు ఫాలో అవ్వడమే..

అలాగే తనకు తెలుగు , హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్ భాషలు మాట్లాడడం వచ్చు అని చెప్పిన ఈమె… ప్రస్తుతం కథలు వింటున్నానని.. ఆచితూచి అడుగులు వేస్తానని.. ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ దిశగా బాటలు వేసుకుంటానని స్పష్టం చేసింది. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్టుగా ఫాలో అవ్వడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పిన నభా నటేష్ డార్లింగ్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం వరస ప్రాజెక్టులు వింటున్నానని చెబుతున్న ఈమె నెక్స్ట్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.. ఏది ఏమైనా యాక్సిడెంట్ తర్వాత రెండు సర్జరీలు జరిగి.. దాదాపు ఆరు నెలలు విశ్రాంతి తీసుకొని.. మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నభా నటేష్. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు