NabhaNatesh : నిషా కళ్ళతో మత్తెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..

Nabha Natesh : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ గ్లామరస్ హీరోయిన్లలో ‘నభా నటేష్’ ఒకరు. ఇస్మార్ట్ శంకర్ తో పాపులర్ అయిన ఈ భామ త్వరలోనే ఇస్మార్ట్ బ్యూటీ గానే పాపులర్ అయింది. ఆ సినిమాలో రామ్ తో పోటీ పడి స్టెప్పులేసి తెగ వైరల్ అయింది. అంతకంటే ముందే అదుగో, నన్ను దోచుకుందువటే సినిమాలతో ఆడియన్స్ ని పలకరించగా ఆ సినిమాలు అంతగా ఆడలేదు. ఇక ఇస్మార్ట్ శంకర్ తరవాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత సినిమాలకు కొన్నాళ్ళు దూరమయింది. ఇక దాదాపు మూడేళ్లకు ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతుంది నభా నటేష్. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో దాదాపు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక సినిమాలతోనే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఇస్మార్ బ్యూటీ.

Nabha Natesh Latest Hot Photoshoot Viral On Instagram

నిషా కళ్ళతో మత్తెక్కిస్తున్న నభా..

అయితే నాభా నటేష్ (NabhaNatesh) ఇంస్టాగ్రామ్ లో ఎంత సందడి చేస్తుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు ఫాన్స్ తో చిట్ చాట్ చేస్తూనే, ఫోటోషూట్లతోనూ రచ్చ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ధీటుగా ఈ అమ్మడు గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ఇస్మార్ట్ బ్యూటీ ఇంస్టాగ్రామ్ లో చేసిన ఫోటోషూట్ తెగ అట్రాక్ట్ చేస్తుంది. బ్లాక్ డ్రెస్ లో మంచి ఫ్లవర్స్ డిజైన్ ఉన్న పొట్టి డ్రెస్ లో ఘాటుగా ఫోజులిచ్చింది. యూత్ ని తన మత్తెక్కించే కళ్ళతోనే అట్రాక్ట్ చేయడం నభా ప్రత్యేకత. అందుకే పెద్దగా సినిమాలు చేయకపోయినా ఇంస్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్లను సంపాదించుకుంది. దాదాపు ఇంస్టాగ్రామ్ లో 5 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకోవడం విశేషం.

- Advertisement -

వరుస సినిమాలతో బిజీ బిజీ..

అయితే ఆ మధ్య చేతికి గాయం కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు దూరమైన నభా నటేష్ చాలా రోజులకు మళ్ళీ బిజీ అయింది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న చారిత్రక నేపథ్యం తో తెరకెక్కుతున్న ‘స్వ‌యంభు’ అనే భారీ చిత్రంలో న‌భా నటేష్ నటిస్తుండగా, ఆ సినిమాలో ఓ రాజ కుమారి గా నభా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రియదర్శి తో కలిసి డార్లింగ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక గ్యాప్ ఇచ్చినా మంచి క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తుండడంతో క్లిక్ అయితే స్టార్ హీరోయిన్ గా తొందరగానే టాలీవుడ్ బిజీ అవడం ఖాయం. అప్పుడప్పుడూ స్పెష‌ల్ వీడియోలు, ఫోటోషూట్ల‌తో నెట్టింట అల‌రిస్తూనే ఉంటుంది. ఇక జులై 19న నభా నటేష్ నటిస్తున్న డార్లింగ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు