Nabhanatesh : లైఫ్ లోనే హ్యాపీయెస్ట్ డే అంట.. అతనంటే అంతిష్టమా!

Nabhanatesh : టాలీవుడ్ లో నన్ను దోచుకుందువటే అనే చిన్న చిత్రంతో పరిచయమైన బ్యూటీ నభా నటేష్. అయితే ఐదేళ్ల కింద వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. ఈ సినిమాతో చాలా మందికి నభా క్రష్ బ్యూటీ అయింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. అయితే కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ తప్ప మరే సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయితే రెండేళ్ల కింద ఓ ఆక్సిడెంట్ లో భుజానికి చేతికి ఇంజ్యూరీ కావడంతో కొంతకాలం నటనకు దూరంగా ఉన్న నభా రీసెంట్ గా ప్రియదర్శి ‘డార్లింగ్’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించింది. అయితే అనూహ్యంగా ఈ సినిమా ప్లాప్ టాక్ ని మూటగట్టుకుంది. ఈ సినిమా కోసం నభా చాలా కష్టపడ్డా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా నభా నటేష్ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన స్టేటస్ వైరల్ అవుతుంది.

Nabha Natesh posted a status on Instagram about Robert Downey

నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ డే – నభా

డార్లింగ్ తో ప్లాప్ అందుకున్న నభా, ఆ సినిమాకు ప్రమోషన్లు మాత్రం గట్టిగానే చేసింది. ఇదిలా ఉండగా నభా నటేష్ లేటెస్ట్ గా ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టింది. ఆ స్టేటస్ లో ఒక హీరో పిక్ షేర్ చేసి, నా లైఫ్ లోనే హ్యాపీయెస్ట్ డే అంటూ షేర్ చేసింది. అసలు విషయానికి వస్తే… నిన్న హాలీవుడ్ లో ఐరన్ మ్యాన్ హీరో రాబర్ట్ డౌనీ ప్రధాన పాత్రలో ‘అవెంజర్స్ డూమ్స్ డే’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు మార్వెల్ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ సందర్బంగా నభా ఆ హీరో పిక్ షేర్ చేసి నా లైఫ్ లో ఇది హ్యాపీయెస్ట్ డే అంటూ షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆ హీరో అంటే అంతిష్టమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

స్వయంభులో నభా బిజీ..

ఇక రీసెంట్ గా డార్లింగ్‌ సినిమాతో ప్లాప్ అందుకున్న నభా ఆ సినిమాతో కొంత ట్రోలింగ్ కి కూడా గురయిందని చెప్పాలి. ఆ సినిమాలో నభా కాస్త ఓవర్ గా పెర్ఫార్మ్ చేసిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో ప్లాప్ అందుకున్నా పాన్ ఇండియా సినిమా స్వయంభులో హీరోయిన్ గా నటిస్తుందివో నభా. సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాలో నభా ఓ రాజకుమారిగా నటిస్తుంది. మరి ఈ సినిమాతోనైనా ఈ బ్యూటీ కం బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు