Nabha Natesh : డార్లింగ్ ని గుర్తు చేయడానికే మళ్ళీ ఈ పిక్స్..

Nabha Natesh : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో ‘నభా నటేష్’ ఒకరు. ఇస్మార్ట్ శంకర్ తో పాపులర్ అయిన ఈ భామ ఇస్మార్ట్ బ్యూటీ గానే పాపులర్ అయింది. ఇక ఇస్మార్ట్ శంకర్ తరవాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో వంటి చిత్రాల్లో నటించింది. ఇదిలా ఉండగా రీసెంట్ గా ప్రియదర్శి (Priyadarshi) తో కలిసి డార్లింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది నభా నటేష్. మూడు వరాల కిందే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా అలరించ లేకపోయింది. అయితే లేటెస్ట్ గా డార్లింగ్ ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేసింది.

Nabha Natesh shared pics with darling movie costumes

నిషా కళ్ళతో మత్తెక్కిస్తున్న నభా..

ఇకపోతే నభా నటేష్ ప్రియదర్శి నటించిన డార్లింగ్ (Darling) సినిమా తాజాగా హాట్ స్టార్ ఓటిటి లో రిలీజ్ అయింది. ఆగష్టు 13 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, డార్లింగ్ ప్రమోషన్స్ టైం లో వేసిన వైట్ కలర్ డ్రెస్ కాస్ట్యూమ్స్ తో పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్ లో నభా క్యూట్ గా ఉండి ఆకట్టుకుంటుంది. అంతే కాదు డార్లింగ్ సినిమాని చూస్టున్నట్టు స్టేటస్ కూడా పెట్టింది. ఇక (Nabha Natesh) ఇంస్టాగ్రామ్ లో ఎంత సందడి చేస్తుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు ఫాన్స్ తో చిట్ చాట్ చేస్తూనే, ఫోటోషూట్లతోనూ రచ్చ చేస్తూ ఉంటుంది. అందుకే దాదాపు ఇంస్టాగ్రామ్ లో 5 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకోవడం విశేషం.

- Advertisement -

వరుస సినిమాలతో బిజీ బిజీ..

ఇక ప్రియదర్శితో చేసిన డార్లింగ్ సినిమా తర్వాత, ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న చారిత్రక నేపథ్యం తో తెరకెక్కుతున్న ‘స్వ‌యంభు’ (Swayambhu) అనే భారీ చిత్రంలో న‌భా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆ సినిమాలో ఓ రాజ కుమారి గా నభా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే త్వరలో మరో తమిళ సినిమాలో కూడా నభా నటించనున్నట్టు సమాచారం. ఇక సినిమాలతో ఎంత బిజీ అయినా, ఫోటోషూట్లతో కూడా అంతే బిజీగా ఉంటూ యాక్టీవ్ గా ఉంటూ, తన ఫాలోవర్లను పెంచుకుంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు