Nag Ashwin: నేను మహాభారత్ చేయలేను అది రాజమౌళికే సాధ్యం, నాగ్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు

Nag Ashwin: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించిన దర్శకుడు ఎవరు అంటే అందరూ తప్పని చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి. చాలామంది కొన్ని కథలను ఊహిస్తారు కానీ అతి తక్కువ మంది దర్శకులు మాత్రమే ఊహించిన కథను వెండితెరపై ఆవిష్కరిస్తారు. అచ్చం ఎస్ఎస్ రాజమౌళి అలాంటి వారే. అసాధ్యం అనుకునే పనిని కూడా సుసాధ్యం చేయగలిగే సామర్థ్యం ఉన్న దర్శకుడు. శాంతి నివాసం సీరియల్ తో దర్శకుడుగా పరిచయమైన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినిమాల్లోకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు.

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ నిలిచింది. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు రాజమౌళి చేసిన ప్రతి సినిమా హిట్ అయింది. ఒక సినిమా హిట్ అవ్వాలి ప్రేక్షకులను మెప్పించాలి అంటే వారి పల్స్ తెలియాలి అని అంటారు. అది కచ్చితంగా ఎస్ ఎస్ రాజమౌళికి తెలుస్తుంది అని చెప్పొచ్చు. ఒక సినిమాను ఎలా తీస్తే ఎలా తెరకెక్కిస్తే ఆడియన్స్ ఆదరిస్తారు అని కంప్లీట్ క్లారిటీ ఉన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అందుకని రాజమౌళికి ఇప్పటివరకు మంచి సక్సెస్ రేట్ ఉంది.

రాజమౌళి విషయానికి వస్తే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ కూడా రాజమౌళి వరకు ఫిదా అయిపోయారు. ప్రతి దర్శకుడికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఉంటుంది. డ్రీమ్ ప్రాజెక్టును వెంటనే చేయకుండా తమకంటూ ఫిలిం మేకింగ్ లో అనుభవం ఇంకా ఎక్కువగా వస్తున్న కొద్ది ఆ సినిమా చేయాలని ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఇక రాజమౌళి అయితే ఇప్పటివరకు తన సినిమాల స్థాయిని పెంచుకుంటూ వెళ్లిపోయారు. రాజమౌళి మనసులో మహాభారతాన్ని సినిమాగా చేయాలని ఎప్పటి నుంచి ఒక ఆలోచన ఉంది. అయితే రాజమౌళి ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా మహాభారతాన్ని నా మైండ్ లో ఉన్నట్టు నేను తీయగలిగితే అంతే చాలు అంతకుమించి మించింది ఇంకేమీ ఉండదు అది నెక్స్ట్ లెవెల్ సినిమా అవుతుంది అని చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చారు.

- Advertisement -

Mahabharata

ఇక రీసెంట్గా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాలో కొన్ని మహాభారతం ఎపిసోడ్స్ ని ఇన్వాల్వ్ చేశాడు దర్శకుడు నాగి. అయితే మహాభారతాన్ని తీసే ఆలోచన మీకు ఉందా అని ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు, లేదు మహాభారతాన్ని నేను కంప్లీట్ గా తీయలేను. ఎస్ఎస్ రాజమౌళి సార్ కి ఆ సత్తా ఉంది. ఖచ్చితంగా ఆయన మాత్రమే దానిని చేయగలరు. ఆయన మహాభారతం చేస్తే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అంటూ రాజమౌళి పై ప్రశంసలు కురిపించాడు నాగ్ అశ్విన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు