Nag Ashwin: కల్కి 2 లో మీరు నాలుగో ప్రపంచాన్ని చూడబోతున్నారు

Nag Ashwin: ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా కల్కి సినిమా గురించి టాపిక్స్ వినిపిస్తూ వస్తున్నాయి. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అంటూ లేనిపోని విషయాల గురించి ప్రస్తావని తీసుకొచ్చి అనేక చర్చలు పెట్టేవారు. కానీ కల్కి సినిమా రిలీజ్ తర్వాత అర్జునుడు కర్ణుడు భీష్ముడు అంటూ కొత్త కొత్త సంభాషణలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఇలాంటివి వినడం కూడా చాలామందికి హ్యాపీ అనిపించింది. అయితే చాగంటి, గరికపాటి వంటి ప్రవచనాలు వినని వాళ్ళు కూడా ఈ సినిమా చూసిన తర్వాత అసలు కథలు ఏంటి అని వెతుక్కుని మరి చూస్తున్నారు.

ఇకపోతే నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఇకపోతే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు అని చెప్పొచ్చు. ఎందుకంటే దర్శకుడు ఈ సినిమాతో ప్రేక్షకుడిని ఒక సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లారు. ఈ సినిమాలో మొత్తం మూడు ప్లేసెస్ ను చూపించాడు నాగ్ అశ్విన్. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి పర్టికులర్ లొకేషన్స్ అని కాకుండా, ప్రతి దానిని సృష్టించుకుంటూ వచ్చారు. ఈ సినిమా మొదలెట్టినప్పుడే ఈ సినిమాకి సంబంధించి చాలా క్రియేట్ చేయాలి ఆ మైండ్ లో ఉన్నది ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు అంటూ చాలా సందర్భాల్లో చెప్పాడు దర్శకుడు.

Kalki 2898 AD

- Advertisement -

ఇకపోతే కల్కి 2 విషయంలో కూడా కొన్ని విషయాలను పంచుకొచ్చాడు నాగి. మొదటి పార్ట్ లో స్టోరీని ఎస్టాబ్లిష్ చేశాడు కాబట్టి అలానే సినిమా కావాల్సిన ప్లేసెస్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ పార్ట్ చాలా ఈజీగా షూట్ చేయొచ్చు అని అందరూ అనుకుంటున్న తరుణంలో మరో ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు నాగ అశ్విన్. ఈ సినిమాకి సంబంధించి మరో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నట్లు దర్శకుడు నాగి తెలిపాడు. అయితే సెకండ్ పార్ట్ కి సంబంధించి కమల్ హాసన్, అమితాబచ్చన్, ప్రభాస్ ను ఒకే ఫ్రేమ్లో చూసే అవకాశం కూడా ఉంది అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు