Nag Ashwin : ఆమె లేకుండా ఈ డైరెక్టర్ సినిమా తీయలేరా..?

Nag Ashwin.. సాధారణంగా కొంతమంది డైరెక్టర్లకి కొంతమంది హీరోయిన్లు లక్కీగా మారిపోతూ ఉంటారు.. అందుకే తాము తెరకెక్కించే ప్రతి సినిమాలో కూడా కనీసం చిన్న పాత్రలోనైనా సరే ఆ హీరోయిన్ కి అవకాశం కల్పించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా తాను తెరకెక్కించే ప్రతి సినిమాలో కూడా ఆమె కోసం ఒక పాత్రను కేటాయిస్తున్నారట. ముఖ్యంగా ఆమె లేనిదే అయిన సినిమాలు తీయడం లేదు అనే వార్త కూడా వినిపిస్తోంది.. మరి ఇంతకూ నాగ్ అశ్విన్ లక్కీ లేడీ ఎవరో ఇప్పుడు చూద్దాం.

నాగ్ అశ్విన్ కి లక్కీ లేడీ గా మారిన మాళవిక నాయర్..

Nag Ashwin : This director can't make a film without her..?
Nag Ashwin : This director can’t make a film without her..?

నాగ్ అశ్విన్ ఇప్పటివరకు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఇప్పుడు ప్రభాస్ తో ఏకంగా పాన్ ఇండియా కల్కి 2898AD సినిమాతో త్వరలోనే రాబోతున్నారు. అయితే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో మెయిన్ హీరోయిన్ మాళవిక నాయర్.. ఈ మలయాళ కుట్టి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతోనే తెలుగులోకి అడుగులు వేసింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నా.. ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ బ్రేక్ రాలేదని చెప్పాలి. మరోవైపు నాగ్ అశ్విన్ కి కూడా ఎవడే సుబ్రహ్మణ్యం మొదటి సినిమా.. ఈ సినిమా తర్వాత ఈయన మహానటి సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నారు.. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కీర్తి సురేష్ కి కూడా ఏకంగా నేషనల్ అవార్డు లభించింది.. ఇకపోతే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో హీరోయిన్గా నటించిన మాళవిక నాయర్ మహానటి సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్ర చేసింది.. ఇప్పుడు కల్కి సినిమాలో కూడా ఈమె మరో కీలకపాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన కల్కి ట్రైలర్ లో మాళవిక నాయర్ కనిపించిన విషయం తెలిసిందే.

నెటిజన్స్ కామెంట్స్..

ఇక దీంతో ఈ డైరెక్టర్ హీరోయిన్ మాళవిక నాయర్ లేనిదే సినిమాలు చేసేలా కనిపించడం లేదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. పైగా మాళవిక నాయర్ .. నాగ్ అశ్విన్ మొదటి సినిమా హీరోయిన్ కావడంతో అందుకే స్నేహం ఏర్పడడం వల్ల తన ప్రతి సినిమాలో కూడా ఆమెకు అవకాశం కల్పిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి కనీసం నాగ్ అశ్విన్ తో నైనా ఈమె కమర్షియల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి. మొత్తానికైతే నాగ్ అశ్విన్ కి లక్కీ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ కనీసం కల్కి 2898 ఏడి చిత్రంతోనైనా కమర్షియల్ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి. మరి ఏ మేరకు పాత్రను తీర్చిదిద్దారో తెలియాల్సి ఉంది.

- Advertisement -

కల్కి మూవీ..

ఇక కల్కి చిత్రం విషయానికి వస్తే.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కమల్ హాసన్ , రజినీకాంత్ , రానా దగ్గుబాటి , దుల్కర్ సల్మాన్ , రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక హీరోయిన్లుగా దీపికా పదుకొనే, దిశాపటాని నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది.. జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా అప్పుడే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లో రూ.400 కోట్లు రాబట్టినట్లు సమాచారం. మరి రూ.700 కోట్ల టార్గెట్ తో బరిలో దిగనున్న ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు