Nag Ashwin: ఏంటి..కల్కి సినిమా కథ రాయడానికి అన్నేళ్లు పట్టిందా?

Nag Ashwin.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా పేరు పొందింది కల్కి -2898AD చిత్రం. ఇందులో హీరోగా ప్రభాస్ నటిస్తూ ఉండగా.. దిశాపటాని, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమలహాసన్ వంటి నటీనటులు సైతం నటిస్తూ ఉన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. వైజయంతి బ్యానర్ పైన ఈ చిత్రాన్ని అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారతీయ పురాణాలతో ముడిపడిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను చూసేందుకు అభిమానులు సైతం చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

కల్కి సినిమా కథ రాయడానికి ఐదేళ్లు పట్టింది…

Nag Ashwin: What... did it take years to write the story of Kalki?
Nag Ashwin: What… did it take years to write the story of Kalki?

నిన్నటి రోజున కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక స్పెషల్ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది.. ముఖ్యంగా ఇందులో కల్కి సినిమా కంటెంట్ గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు. వాస్తవానికి కల్కి సినిమా అన్ని ఆధారాలను చూసుకుంటే ఈ సినిమా కథ రాయడానికి దాదాపుగా ఐదేళ్లు సమయం పట్టిందట. చిన్న వయసు నుంచే తనకు పౌరాణిక చిత్రాలు అంటే చాలా ఇష్టమని.. ముఖ్యంగా భైరవద్వీపం, పాతాళభైరవి వంటి సినిమాలు ఎన్నోసార్లు చూశానని తెలిపారు నాగ్ అశ్విన్.

సృజనాత్మక ఊహతో కథ..

ఇలాంటి సినిమాల నుంచి పుట్టిందే కల్కి సినిమా అంటూ తెలిపారు.. అలాగే మన పురాణాలలో చదివిన ఒక గొప్ప యుద్ధం గా పేరు పొందింది.. మహాభారతం లో పెద్ద సంఖ్యలో ఉన్న గొప్ప గొప్ప పాత్రలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమా కృష్ణ అవతారంతో చివరిగా ముగుస్తుందని.. అక్కడి నుంచే కలియుగం మొదలవుతుందని.. ఆ తర్వాత జరిగేటువంటి సంఘటనల ఆధారంగానే ఈ సినిమా కథను సృజనాత్మక ఊహతో కథ రాసుకున్నానని తెలిపారు అశ్విన్.. కృష్ణుడు అవతారం తర్వాతే దశావతారం కల్కి అంటూ తెలిపారు.

- Advertisement -

కలియుగం భవిష్యత్తు కూడా..

కలియుగంలో ఎలా జరగబోతోంది..? ఎలా జరగవచ్చు..? అనే విషయాన్ని ఇందులో చూపించామని.. మనం చదువుకున్న పురాణాలు అన్నింటికీ కూడా ఇది ఒక అంతిమ ఘట్టం లాంటిది అంటూ తెలియజేశారు. ముఖ్యంగా కల్కి అనే ఒక పాత్ర ప్రతి యుగంలో కూడా ఉంటుంది అంటే వెల్లడించారు.. ఒక యుగంలో అది రావణుడిలా.. మరొక యుగంలో దుర్యోధనుడిలా ఇలా ఒక్కొక్క చోట ఒక రూపంలో తీసుకున్నట్లు అయితే కలియుగానికి వచ్చేసరికి అది చివరి రూపం అనుకుంటే.. అతనితో ఎలాంటి పోరాటం చేయాలని ఉద్దేశంతోనే ఈ కథ అన్నట్టుగా తెలిపారు. ఈ కథ రాయడానికి తనకు ఐదేళ్లు పట్టింది అంటూ వెల్లడించారు నాగ్ అశ్విన్. అయితే ఈ విషయం తెలిసి అటు అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి అన్ని సంవత్సరాలు రాయడానికి పట్టిన ఈ కథ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. ఇక అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్, కమల్ హాసన్,, అమితాబ్ బచ్చన్ వంటి నటులతో నటించడం తనకు చాలా గొప్ప అనుభూతిని ఇస్తుందంటూ కూడా తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు