Nag Ashwin : అలా జరగలేదు కాబట్టే హ్యాపీగా ఉన్నాం.. కొత్త ప్రభుత్వంపై నాగి రియాక్షన్..

Nag Ashwin : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా థియేటర్లలో భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. గత వారం రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 700 కోట్ల వసూళ్లు దాటేయగా, రెండో వారం కూడా ఏ సినిమాలు రిలీజ్ కాకపోవడంతో థియేటర్ల వద్ద రెండో వీకెండ్ కూడా అదిరిపోయే కలెక్షన్లను అందుకుంటుంది. ఇక ఈ సినిమాకి ఒక పక్క కాస్త నెగిటివిటి వస్తున్నా, అద్భుతమైన విజువల్ వండర్ ని చూడడానికి కామన్ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఇక థియేటర్లలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ స్క్రీన్ ప్రెజెన్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. అలాగే కమల్ హాసన్ కొత్త గెటప్ కి సైతం ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మేకర్స్ భారీ రేట్లను నిర్ణయించడం జరిగింది. తెలంగాణలో ఎప్పుడో దీనిపై అనుమతి రాగా, ఆంధ్రప్రదేశ్ లో కూడా టికెట్ రేట్లను పెంచేసి భారీ ఓపెనింగ్స్ రాబట్టారు నిర్మాతలు. ఇదిలా ఉండగా కల్కి పై నాగ్ అశ్విన్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టగా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

Nag Ashwin's reaction to Kalki2898AD ticket rate hikes in Andhra Pradesh

కల్కిపై నాగ్ అశ్విన్ రియాక్షన్…

ఇక కల్కి గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగ్ అశ్విన్ పలు విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఇందులో భాగంగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) సినిమా తీసినందుకు అద్భుతమైన ప్రశంసలు దక్కగా, ఈ సినిమాలో పలు విషయాలని కూడా విలేఖరులు ప్రస్తావించడం జరిగింది. ఇక ఈ సినిమాలో కృష్ణుడిగా మహేష్ బాబు ని చూపించే అవకాశం ఉందా అనగా,… ఈ సిరీస్ లో కాదు బహుశా ఛాన్స్ ఉంటె వేరే సినిమాలో చూపించొచ్చు అని అన్నాడు. అలాగే ఈ సినిమా కల్లెక్షన్లపై ప్రస్తావన వచ్చినపుడు నాగ్ అశ్విన్ కి మరో ప్రశ్న ఎదురైంది. దానిపై నాగ్ అశ్విన్ వివరణ కూడా కొత్తగా అనిపించింది.

- Advertisement -

కొత్త ప్రభుత్వంపై నాగి రియాక్షన్..

ఇక కల్కి టికెట్ రేట్ల ప్రస్తావనలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఇప్పుడు కల్కి టికెట్ రేట్లపై ఇంత హైక్ ఇచ్చి ఉండకపోవచ్చు, లేకపోతే ఇన్ని కోట్లు మీకు వచ్చి ఉండకపోవచ్చు… అని అంటూ దీనిపై నాగ్ అశ్విన్ ఏమంటారు అని విలేఖరి అడిగాడు. దీనికి నాగ్ అశ్విన్ రిప్లై ఇస్తూ… అదంతా అవలేదు కాబట్టే హ్యాపీగా ఉన్నాం, సాటిస్ఫాక్షన్ గా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా కొత్త గవర్నమెంట్ పై నాగ్ అశ్విన్ థన్ సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఇక కల్కి సినిమా రెండో వీకెండ్ లో కూడా థియేటర్లలో మంచి కలెక్షన్లు నమోదు చేస్తుండగా, ఈ వారం టికెట్ రేట్లు నార్మల్ అయ్యాయి కాబట్టి ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు బాగా వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ రన్ తోడైతే కల్కి ఈజీ గా వెయ్యి కోట్ల వసూళ్ళని అందుకునే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు