Nag Chaitanya: “థాంక్యూ” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటాయి.
ఆ కాంబినేషన్ లో సినిమాలు చూడాలని ప్రేక్షకులు మంచి ఆతృతతో ఉంటారు. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి నాగ చైతన్య & విక్రమ్ కె కుమార్ కాంబినేషన్.

ఇష్టం సినిమాతో తెలుగు లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ తీసినవి కొన్ని సినిమాలే అయినా వాటిలో అవి గొప్ప సినిమాలు.నితిన్ తో చేసిన ఇష్క్ సినిమా విక్రమ్ కెరియర్ కు మంచి పేరును తీసుకుని వచ్చింది. ఆ తరువాత చేసిన 24, హలో సినిమాలు స్లో గా ఆడినా , అక్కినేని ఫ్యామిలీ తో చేసిన మనం సినిమా మాత్రం ఒక గొప్ప జ్ఞాపకాన్ని అందించింది.

విక్రమ్ చివరగా చేసిన నాని గ్యాంగ్ లీడర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా సినిమాకు కొత్తదనాన్ని తీసుకువచ్చే విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం నాగచైతన్య తో “థాంక్యూ” అనే సినిమాను చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఆ సినిమా జులై 8 న రిలీజ్ కాబోతున్నట్లు ఆఫీసియల్ అనౌన్సమెంట్ ఇచ్చింది మూవీ టీం. ఇదివరకే అక్కినేని ఫ్యామిలీ కి “మనం” లాంటి అదిరిపోయే హిట్ ఇచ్చిన విక్రమ్ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు