Naga Chaitanya: అక్కినేని హీరో రెండో పెళ్లిని అడ్డుకుంటుంది ఎవరో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత ఆరేళ్లపాటు ప్రేమించుకొని.. ఆపై పెద్దలను ఒప్పించి గోవాలో రెండు సాంప్రదాయాల ప్రకారం వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో.. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట చివరకు విడాకుల వైపు టర్న్ తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ తో వారు బిజీ అయిపోయారు. అయితే వీరు వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఎప్పుడైతే విడాకుల ప్రకటన చేశారు అప్పటినుంచి ఇద్దరి వ్యక్తిగత విషయాలపై ఎన్నో రూమర్స్ బయటకు వచ్చాయి.

అక్కినేని ఫ్యామిలీ కండిషన్స్, సమంత బిహేవియర్ అంటూ బోలెడన్ని పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య రెండవ పెళ్లి అంటూ కూడా మరో వార్త బయటకు రావడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. విడాకుల ప్రకటన తర్వాత సినిమాలతో బిజీ అయిన నాగచైతన్య రెండవ పెళ్లికి సిద్ధమయ్యారని, ఈ మేరకు లోలోపల అక్కినేని ఫ్యామిలీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారనే టాక్ బయటకు వచ్చింది.

నాగార్జున కూడా చైతుకు సంబంధాలు వెతుకుతూ ఉండడంతో అమల మాత్రం అడ్డుపడుతున్నట్లు టాక్. ఎందుకంటే అఖిల్ కి పెళ్లి సంబంధం కుదరకుండా, అఖిల్ పెళ్లి కాకుండా నాగచైతన్యకు రెండవ పెళ్లి చేయవద్దని నాగార్జునను అమల అడ్డుకుంటుందట. అఖిల్ కు కూడా సంబంధం చూసిన తరువాత ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నాగ్ కు సూచించిందని రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయంపై ఇంట్లో వాళ్ళతో గొడవపడి నాగచైతన్య కొత్త ఇల్లు కొనుక్కొని అందులో ఉంటున్నాడట. ఏది ఏమైనాప్పటికీ అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంతా కూడా రెండు పెళ్లిళ్లు చేసుకుంటూ ఒక ట్రెండ్ ని సృష్టిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు