Nagachaithanya -Shobhitha : నాగ చైతన్య – శోభిత ఎంగేజ్మెంట్ ఫోటో వచ్చేసింది.. నాగార్జున ఎమోషనల్ పోస్ట్..

Nagachaithanya -Shobhitha : అక్కినేని నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ అంటూ గత కొన్నిరోజులుగా వస్తున్నా వార్తలకు చెక్ పెట్టేశారు. తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Naga Chaitanya - Sobhita engagement photo is here.. Nagarjuna's emotional post..
Naga Chaitanya – Sobhita engagement photo is here.. Nagarjuna’s emotional post..

ఈరోజు ఉదయం 9.42 నిమిషాలకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఫోటోలను అక్కినేని నాగార్జున షేర్ చేశారు. తనకు చాలా సంతోషంగా ఉందని వీరిద్దరూ జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా అని ఫోటోలను షేర్ చేశాడు..

Naga Chaitanya - Sobhita engagement photo is here.. Nagarjuna's emotional post..
Naga Chaitanya – Sobhita engagement photo is here.. Nagarjuna’s emotional post..

నాగ చైతన్యకు గతంలో హీరోయిన్ సమంతతో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు . ఇప్పుడు వేరు వేరుగా ఉంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే సామ్ మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ప్రస్తుతం సినిమాలను లైన్ల్ పెడుతుంది.

- Advertisement -

అటు నాగచైతన్య కూడా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కలిసి ఫారిన్ ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేసేవారు. గతంలో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి. ఇద్దరు పెద్దగా స్పందించలేదు. కొద్ది నెలల కిందట ఫారిన్‌ వేకేషన్‌లో కలిసి కనిపించింది ఈ జంట. అప్పట్నుంచే ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేశారు నాగార్జున.. వీరిద్దరిని ఇలా చూడటం సంతోషంగా ఉందని పోస్ట్ లి పేర్కొన్నాడు.

శోభిత బాలీవుడ్ , కోలీవుడ్ లో మాత్రమే కాదు . తెలుగులో కూడా సినిమాలను చేసింది. 2018లో వచ్చిన గూఢాచారి… 2022లో వచ్చిన మేజర్‌ మూవీలలో నటించింది. వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయిన సందర్భంగా సినీ ప్రముఖులు వారికి సోషల్ మీడియాలో ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు