Naga Shourya: నీకు ఎందుకు ఇవన్నీ ఇప్పటివరకు బాగానే ఉన్నావ్ గా

Naga Shourya: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో నాగశౌర్య ఒకరు. అయితే నాగశౌర్య ఇప్పటికే దాదాపు పాతిక సినిమాలను పైగా చేశాడు. ఇది ఎవరు నమ్మలేరు. ఎందుకంటే నాగశౌర్య కెరియర్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు. 2011లో క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్ అనే సినిమాతో తన కెరియర్ స్టార్ట్ చేశాడు నాగశౌర్య.

ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన చందమామ కథలు సినిమాలో రాజు అనే క్యారెక్టర్ ను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాస్ అవసరాల దర్శకుడుగా పరిచయమైన ఊహలు గుసగుసలాడే సినిమాతో మెయిన్ లీడ్ గా చేసి హీరోగా తనను తాను నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత చేసిన దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జాదుగాడు, అబ్బాయితో అమ్మాయి వంటి సినిమాలు పరవాలేదు అనిపించుకున్నాయి.

అయితే నాగశౌర్యకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం ఛలో అని చెప్పొచ్చు. వెంకీ కుడుముల దర్శకుడుగా పరిచయమైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత చేసిన కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి. మళ్ళీ 2019లో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ సినిమా మంచి హిట్ అయింది.

- Advertisement -

అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అశ్వద్ధామ అనే సినిమా డిజాస్టర్ గా మిగిలింది. తర్వాత చేసిన వరుడు కావలెను సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత వచ్చిన లక్ష్య సినిమా అంతంత మాత్రమే ఆడింది. ఇకపోతే నాగ శౌర్య చేసిన కృష్ణవింద విహారి, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన ఇంపాక్ట్ ను చూపించలేదు. కానీ ఒకరకంగా బాగానే ఆడాయి అని చెప్పొచ్చు. నాగ శౌర్య చేసిన చివరి సినిమా రంగబలి కూడా పరవాలేదు అనిపించింది.

Naga Sharuya with Darshan.

సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి కూడా నాగ శౌర్య స్పందిస్తూ ఉంటాడు. ఇద్దరు లవర్స్ రోడ్డు పైన గొడవ పడుతున్నప్పుడు కూడా అమ్మాయిని ఒక అబ్బాయి కొడితే కారు ఆపి మరి ప్రశ్నించాడు. ఇకపోతే రీసెంట్ గా కన్నడలో సంచలనం సృష్టిస్తున్న కేసు దర్శన్ ది. తన అభిమానిని ఎంత దారుణంగా చంపించాడో ఎన్నో వీడియోస్ బయటకు వచ్చాయి. అయితే తన గురించి సపోర్టుగా ఒక పోస్ట్ పెట్టాడు నాగశౌర్య. అయితే దీనిపై చాలామంది పలు రకాలుగా స్పందిస్తున్నారు. అందులో కొందరు మాత్రం ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా నీకు ఎందుకు ఇవన్నీ అవసరమా అంటూ ట్రోల్ కూడా మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు