Nagababu : ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేసిన మెగా బ్రదర్

Nagababu: మెగా ఫ్యామిలీలో ఎవరి పైన విమర్శలు చేసినా కూడా మొదటిగా రియాక్ట్ అయ్యేది మెగా బ్రదర్ నాగబాబు. నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడుగా మంచి గుర్తింపు సాధించిన తర్వాత జబర్దస్త్ షో కి జడ్జిగా హాజరై దాని ద్వారా మరికొంత గుర్తింపును సాధించాడు. అయితే ఆ తర్వాత సినిమాల్లో కూడా ప్రముఖ పాత్రలను పోషించాడు. అయితే ఎవరు ఎన్ని కామెంట్స్ మెగా ఫ్యామిలీ పైన చేసినా కూడా వాటన్నిటికీ సరైన సమాధానం అందించడంలో ఎప్పుడూ ముందుంటారు నాగబాబు. అలానే చాలా విషయాలు పైన కూడా స్పందిస్తారు. గతంలో చాలామందికి సమాధానం కూడా చెబుతూ వచ్చారు.

యండమూరి వీరేంద్రనాథ్ కు సమాధానం
గతంలో రామ్ చరణ్ తేజ్ పైన కొన్ని విమర్శలు చేశారు ప్రముఖ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్. అయితే ఆయన గురించి కూడా రియాక్ట్ అవుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు నాగబాబు. అయితే దీనిపైన యండమూరి వీరేంద్రనాథ్ కూడా స్పందించారు. యండమూరి వీరేంద్రనాథ్ అంటే నాగబాబుకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కలిసినా కూడా గురువుగారు గురువుగారు అంటూ తనను గౌరవిస్తారు. అయితే రామ్ చరణ్ పై యండమూరి చేసిన కామెంట్స్ కి దీటుగా సమాధానం ఇచ్చారు నాగబాబు.

రామ్ గోపాల్ వర్మ పై ఫైర్
అయితే రామ్ గోపాల్ వర్మ చాలాసార్లు మెగా ఫ్యామిలీ పైన అనేక విమర్శలను చేశారు. అయితే వాటికి మెగా ఫ్యామిలీ ఏ రోజు స్పందించలేదు. కానీ ఖైదీ నెంబర్ 150 ఆడియో లాంచ్ లో వీటన్నిటికీ ధీటుగా స్పందించి సరైన సమాధానాన్ని ఇచ్చాడు నాగబాబు. అక్కడినుంచి మెగా ఫ్యామిలీ పై రాంగోపాల్ వర్మ విమర్శలు చేయటం ఇంకా ఎక్కువగా మొదలుపెట్టాడు. ఇలానే చాలా సందర్భాల్లో నాగబాబు స్పందిస్తూ వచ్చారు.

- Advertisement -
Nagababu : Mega Brother whose Twitter account has been deactivated
Nagababu : Mega Brother whose Twitter account has been deactivated

ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్
ఇక లేటెస్ట్ గా నాగబాబు ఒక ట్వీట్ ను వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ట్వీట్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ను ఉద్దేశించి వేసారంటూ చాలామంది అనుకున్నారు. అలానే చాలామంది కూడా కన్ఫామ్ చేసేసారు. అయితే అది ఎవరి గురించి నాగబాబు వేసాడు అనే క్లారిటీ మాత్రం ఎవరికీ రాలేదు. ఇక దీనిపై నాగబాబుని చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. చాలా ప్రశ్నలకు రాజకీయంపరంగా సమాధానం ఇచ్చిన నాగబాబు ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం నాగబాబు ట్విట్టర్ అకౌంట్ ని కూడా డిఆక్టివేట్ చేశారు. మళ్లీ ఎప్పుడు యాక్టివ్ చేసి స్పందిస్తారు తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు