Nagababu: చిరు పై అలాంటి కామెంట్స్.. నాగబాబు దెబ్బకు సైలెంట్ అయిన బాలయ్య..!

Nagababu.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి – బాలకృష్ణ అప్పట్లో ఎంతో క్రేజ్ దక్కించుకున్నారు.. కానీ ఇద్దరి అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే.. భగ్గుమనేంత పగ ప్రతికారాలు ఉండేవి.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులు పూర్తిస్థాయిలో గొడవపడేవారు. అయితే ఇంతటి క్రేజ్ దక్కించుకున్న చిరంజీవిని బాలకృష్ణ కామెంట్లు చేయడంతో ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని సమాచారం.

Nagababu: Such comments on Chiru.. Balayya became silent after Nagababu's blow..!
Nagababu: Such comments on Chiru.. Balayya became silent after Nagababu’s blow..!

అసలు విషయంలోకి వెళ్తే 80 ల వరకు టాలీవుడ్ పై నందమూరి కుటుంబానిదే హవా.. నందమూరి తారక రామారావు టాలీవుడ్ లో టాప్ స్టార్ మాత్రమే కాదు తిరుగులేని స్టార్డం అందుకున్నారు కూడా.. 1982లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.. అదే సమయంలో చిరంజీవి నటుడిగా ఎదుగుతున్నాడు.. ఎన్టీఆర్ సినిమాలకు దూరం కావడంతో ఆయన స్థానాన్ని చిరంజీవి భర్తీ చేశారు. ఇక 90 నాటికి చిరంజీవి స్టార్డం తిరుగులేకుండా పోయింది. అదే సమయంలో ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ కూడా స్టార్ హోదా అందుకున్నారు.. కానీ పై చేయి మాత్రం చిరంజీవిదే.. అలాంటి చిరంజీవి స్టార్ హోదాను బాలకృష్ణ ఓర్వలేకపోయారని సమాచారం.

సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ స్థానాన్ని భర్తీ చేసిన చిరంజీవి..

నిజానికి బాలకృష్ణ , చిరంజీవి పైకి మంచిగా కనిపించినా.. ఇద్దరి మధ్య తెలియని కోల్డ్ వార్ నడిచేది అనే వాదన వినిపిస్తూ ఉంటుంది ..అభిమానులు మాత్రం తరచుగా కొట్లాటలకు దిగేవారు.. నటుడిగా నందమూరి కుటుంబం పై చేయి సాధించినా..చిరంజీవి రాజకీయ నాయకుడిగా మాత్రం విఫలం చెందాడు. ఎన్టీఆర్ తర్వాత సీఎం అయిన నటుడిగా ఆయన రికార్డులలోకి ఎక్కాలి అనుకున్నారు. అందులో భాగంగానే ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు..2009 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు.. చిరంజీవి గేమ్ చేంజర్ అవుతాడు అనుకుంటే ఆయన అంచనాలు తలకిందులు అయ్యాయి .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది . ఇక తర్వాత ఈ పి ఆర్ పి పార్టీని చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేశాడు..

- Advertisement -

చిరంజీవి రాజకీయ భవిష్యత్తుపై విమర్శించిన బాలయ్య..

ఇకపోతే చిరంజీవి సినిమా పరంగా ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన కెరియర్లో రాజకీయ జీవితం అనేది ఒక మాయని మచ్చ.. ఈ విషయం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి కూడా చిరంజీవి వేదనకు గురయ్యేవారు. తాను చేసిన అతి పెద్ద తప్పు రాజకీయాల్లోకి రావడమే అని చెబుతూ ఉంటారు. ఇలా బాధ అనుభవిస్తున్న సమయంలో పైసా వసూల్ మూవీ విడుదల సమయంలో బాలకృష్ణ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో పాటు చాలామంది నటులు రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.. మరింత మంది రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు.. దీనికి మీ అభిప్రాయం ఏమిటి అని యాంకర్ అడగగా.. బాలయ్య మాట్లాడుతూ… రాజకీయాల్లోకి రావాలని నేను ఎవరిని పిలవను.. రాజకీయాలు అంటే ఎమోషన్ కాదు అమితాబచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు… గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంటుకు వెళ్ళాడు .. అక్కడ ఆటోగ్రాఫ్ ఇవ్వడమే సరిపోతుంది. ఇక చిరంజీవి కూడా అంతే రాజకీయాల్లోకి అందరూ రాణించలేరు మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అన్నారు. అంతేకాదు ప్రత్యక్షంగా విమర్శించారు కూడా..

జంతువులు కాదు అంటూ బాలయ్య పై గట్టి కౌంటర్ ఇచ్చిన నాగబాబు..

దీంతో కోప్పడిపోయిన నాగబాబు తన అన్నయ్య పై ఇలాంటి కామెంట్లు చేయడంతో 2019లో బాలకృష్ణ మీద ఘాటైన కామెంట్లు చేశాడు.. బ్లడ్ బ్రీడ్ అనేది జంతువులకు మాత్రమే.. అమితాబ్ , చిరంజీవిని విమర్శించే స్థాయినిది కాదు అంటూ బాలకృష్ణకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.. ఇక నాగబాబు దెబ్బకు బాలయ్య సైలెంట్ అయిపోయారు అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు