Nagarjuna:రాత్రిళ్ళు అది లేకపోతే నిద్రపట్టదు.. బోల్డ్ కామెంట్స్ వైరల్..!

Nagarjuna: తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో ఇప్పటికీ ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ యంగ్ హీరో గా కనిపిస్తూ ఉండేటువంటి ఏకైక హీరో ఎవరంటే కచ్చితంగా అందరూ నాగార్జున పేరే చెబుతారు.. అందుకే ఈయనని నవమన్మధుడు అని పిలుస్తూ ఉంటారు. తను తినే ఫుడ్ డైట్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు నాగార్జున. ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలకు దీటుగా.. కుర్రాడిలా కనిపిస్తూ ఉంటారు నాగార్జున. ముఖ్యంగా ఆయన మాట్లాడే మాటలు , చేసే సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి..

రాత్రిపూట అది లేకపోతే నిద్ర పట్టదు..

Nagarjuna: Can't sleep at night without it.. Bold comments viral..!
Nagarjuna: Can’t sleep at night without it.. Bold comments viral..!

తాజాగా ఇటీవలే నాగార్జున తన ఫిట్నెస్ గురించి బోలెడు విషయాలను తెలియజేశారు. నాగార్జున ఎక్కువగా మిల్లెట్స్ ఉండేటువంటి వాటిని తీసుకుంటూ ఉంటారట. అలాంటి వాటిలో జ్యూస్, భోజనం చేసే టైమింగ్ కూడా తెలియజేశారు. అలాగే రాత్రిపూట చేసే పనులను కూడా నాగార్జున చాలా క్లియర్ గా వివరించారు. అలాగే తాను ఆల్కహాల్ కూడా తీసుకుంటాను అంటూ తెలియజేశారు. నా సామిరంగా సినిమా సమయంలో కీరవాణి , చంద్రబోస్ లతో కలిసి చిట్ చాట్ లో ఈ విషయాలను నాగార్జున తెలియజేశారు. ప్రతిరోజు రాత్రి నిద్రకి ముందు రెండు రౌండ్లు ఆల్కహాల్ వేసుకుంటానని తెలిపారు నాగార్జున.

ఫుడ్ విషయంలో జాగ్రత్తలు..

అలాగే ఫుడ్ విషయానికి వస్తే.. పప్పుతో పాటు రెండు మూడు రకాల కూరగాయల ఫ్రై.. నాన్ వెజ్ లో చికెన్ , ఫిష్ ఇలా అన్నిటిని కూడా తింటానని తెలిపారు. రాత్రి పడుకునే సమయంలో తొందరగానే భోజనం చేస్తాను.. అది కూడా వైట్ రైస్ తో కాకుండా బ్రౌన్ రైస్ మాత్రమే తింటానని తెలిపారు. రాత్రి పడుకునే సమయంలో కచ్చితంగా స్వీట్ తింటానని ఇది తనకి అలవాటుగా మారిపోయిందని తెలిపారు. చాలా గ్యాప్ తర్వాత నాగార్జున ఈ ఏడాది నా సామి రంగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

- Advertisement -

ధనుష్ తో మల్టీ స్టారర్..

ఇప్పుడు తాజాగా హీరో ధనుష్ ,నాగార్జున కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కుబేర అనే టైటిల్ ను కూడా ప్రకటించారు. ఇదే కాకుండా మరి కొంతమంది స్టార్ హీరోల చిత్రాలలో కూడా నాగార్జున నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతికి కూడా మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా నాగార్జున ప్లాన్ చేస్తున్నారు.

ఇకనైనా అక్కినేని వారసులు సక్సెస్ అయ్యేరా…

ఈయన కుమారులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే వరుస సినిమాలు చేస్తున్నారు కానీ అక్కినేని నాగేశ్వరరావు రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అక్కినేని వారసులు సక్సెస్ అయితే చూడాలని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. కానీ వీరికి మాత్రం సరైన హిట్టు పడడం లేదు.. అటు నాగ చైతన్య అడపా దడపా సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతుంటే అఖిల్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నత్త నడకన ఆయన కెరియర్ సాగుతోంది.. మరి ఇకనైనా తన ఖాతాలో ఒక హిట్ సినిమా అయినా వేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు