Akkineni Nagarjuna : సీఎంపై నాగార్జున రివేంజ్… ఒక్క రూపాయి కూడా ఇచ్చేదేలే..

Nagarjuna: గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. ఎటువైపు నుంచి వరద వస్తుందా అని బిక్కు బిక్కుమని నీళ్లల్లోనే గడుపుతున్నారు. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహించాయి. రాష్ట్రాలోని పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. నిన్నటి నుంచి వరదలు కాస్త తగ్గు ముఖం పట్టినప్పటికి.. పరిస్థితి మాత్రం ఇంకా చక్కబడలేదు. ఇళ్లన్నీ నీట మునగడంతో కట్టుబట్టలతో సహాయక శిబిరాలకు చేరుకున్న జనాలు. తిండి, నీరు కోసం అలమటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలను ఆదుకోవడం కోసం రాజకీయ నేతలు, సెలెబ్రేటీలు కదిలివస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. కానీ అక్కినేని నాగార్జున ( Nagarjuna ) మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

Nagarjuna did not help the flood victims of Telugu states
Nagarjuna did not help the flood victims of Telugu states

ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినా నాగార్జున ముందుంటాడు.. తోచిన సాయాన్ని ప్రకటించేవాడన్నా విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం స్పందించలేదు. అందుకు కారణాలు కూడా ఉన్నాయని నాగ్ ఫ్యాన్స్ అంటున్నారు. నాగ్ కు సంబందించిన ఎన్ కన్వీన్షణ్ కూల్చివెయ్యడంతో నాగ్ స్పందించలేదని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాట పక్కన పెడితే తెలంగాణకు కూడా అక్కినేని హీరోలు సాయం చెయ్యకపోవడం పై అదే అనుమానం కలుగుతుంది. నిజంగానే నాగార్జున ఇలా ఆలోచిస్తున్నాడా అనేది మాత్రం తెలియదు కానీ దీనిపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై అక్కినేని ఫ్యామిలీ స్పందించి విరాళం ఇస్తారా లేదా ఈ వార్తల పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి..

సీఎంపై నాగార్జున రివేంజ్…

నాగార్జున హైదరాబాదులో నిర్మించుకున్న ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది రేవంత్ రెడ్డి (Revanth Reddy ) ప్రభుత్వం. కబ్జా చేసి.. ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా కూల్చివేసింది. అక్కినేని నాగార్జునకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే.. పొద్దు పొద్దున్నే వచ్చి హైడ్రాధికారులు ఎన్ కన్వెన్షన్ ను ధ్వంసం చేశారు. దీంతో అక్కినేని నాగార్జునకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న అక్కినేని నాగార్జునకు అంత ఎదురు దెబ్బ తగిలితే టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు స్పందించలేరు. ఇక అధికారులు కూడా దీనిపై నోరు విప్పలేదు. దీంతో నాగ్ కు కోపం వచ్చిందని తెలుస్తుంది. సీఏం పై రివేంజ్ తీర్చుకుంటున్నాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకే వరద బాధితులను ఆదుకోవడం కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇకపోతే ఇప్పటికే ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి వంటి సినీ స్టార్స్ తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు భారీ ఎత్తున విరాళం ప్రకటించారు. అలానే తాజాగా పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ ముందుకు వచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు