Nagarjuna: మొదటి భార్యతో విడాకులు.. ఫస్ట్ టైం స్పందించిన నాగ్..!

Nagarjuna.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవ మన్మధుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఇప్పటికే వరుస సినిమాలు, షోలు చేస్తూ భారీ క్రేజ్ దక్కించుకున్న ఈయన.. వ్యక్తిగతంగా గతంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే . ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మీతో ఈయన మొదటి వివాహం జరిగింది. వీరికి నాగచైతన్య జన్మించారు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు కోరికల మేరకు వీరిద్దరి వివాహం 1984లో జరిగింది. ఇక లక్ష్మీ నుంచి విడిపోయిన తర్వాత నాగార్జున 1991లో అమలను వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఆసక్తి చూపించని నాగార్జున.. తాజాగా తన జీవితంలో జరిగిన అత్యంత బాధాకర సంఘటన గురించి ఒక ఇంటర్వ్యూలో మొదటిసారి ఓపెన్ అయ్యారు..

Nagarjuna: Divorce with his first wife..Nag responded for the first time..!
Nagarjuna: Divorce with his first wife..Nag responded for the first time..!

ఆ క్షణం అత్యంత బాధాకరమైనది..

అసలు విషయంలోకి వెళితే.. నాగార్జున మాట్లాడుతూ.. నేను, లక్ష్మి విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్యని వాళ్ళ అమ్మతో పంపాల్సి వచ్చింది.. అప్పుడు నేను చాలా బాధపడ్డాను… కానీ ఆ టైంలో వాడు వాళ్ళ అమ్మ దగ్గర పెరగాలి.. కాబట్టి పంపక తప్పలేదు.. అయితే అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ వెళ్తూ ఉండేవాడు.. అది కొంచెం సంతోషాన్ని ఇచ్చేది.. స్కూలింగ్ అయిపోయాక కంప్లీట్ గా హైదరాబాద్ కి వచ్చేసాడు.. ఇక చిన్నతనంలో పూర్తిస్థాయిలో వాడు నా దగ్గర లేడు అనే బాధ.. ఆ క్షణాలు.. ఇప్పటికీ నన్ను కలచి వేస్తాయి అంటూ నాగార్జున తెలిపారు. ప్రస్తుతం నాగార్జున షేర్ చేసిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నాగచైతన్య కూడా చాలా సందర్భాలలో తన తల్లి దగ్గర ఉండడానికి తను ఎప్పుడు సంతోషంగా ఉంటానని చెప్పిన విషయం తెలిసిందే.

వారిద్దరూ చైతూ కి మేనమామలే..

ఇకపోతే నాగచైతన్యకు దగ్గుబాటి సురేష్, బాబు విక్టరీ వెంకటేష్ మేనమామలు అవుతారు.. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఇక నాగచైతన్య , నాగార్జున కలసి మనం సినిమాలో నటించిన విషయం తెలిసిందే .అలాగే బంగార్రాజు సినిమాలో కూడా వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఇకపోతే వీరి వారసుడు అఖిల్ కూడా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.. అఖిల్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ ఇప్పటివరకు సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. మరి ఇప్పుడు రాబోయే చిత్రాలతోనైనా అఖిల్ తనని తాను ప్రూవ్ చేసుకుంటారేమో చూడాలి.

- Advertisement -

నాగార్జున కెరియర్..

నవ మన్మధుడు నాగార్జున టాలీవుడ్ లో ఎవరు గ్రీన్ హీరో అని చెప్పవచ్చు. ఆరు పదుల వయసులో కూడా ఫిట్నెస్ లెవెల్స్ అద్భుతం.. నాగార్జున టాలీవుడ్ హీరోలలో అత్యంత ధనికుడు అని కూడా అందరూ అంటూ ఉంటారు.. ఈయనకి సినిమాలతో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి.. పైగా బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలకు గత నాలుగు సీజన్లుగా హోస్ట్గా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇక కొడుకుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బిజీగా మారిపోయారు నాగార్జున.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు