Nagarjuna: నాగార్జునకు గుడ్ న్యూస్..ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత పై హైకోర్టు స్టే జారీ..!

Nagarjuna.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)ఇప్పుడు వార్తల్లో నిలిచారు. వివాదాలకు దూరంగా ఉండే ఈయన తాజాగా చిక్కుల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే, హైదరాబాదులోని మాదాపూర్ లో ఉన్న తుమ్మిడి కుంట చెరువు దగ్గర పది ఎకరాల విస్తీర్ణంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో మూడున్నర ఎకరం కబ్జా చేసి మరీ నాగార్జున ఈ ఎన్ కన్వెన్షన్ (N- Convention)ను నిర్మించారు అంటూ ఆరోపణలు వచ్చాయి. అంతటితో ఆగకుండా ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు ఉదయం ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేసింది.

Nagarjuna: Good news for Nagarjuna..High Court stay on demolition of N convention hall..!
Nagarjuna: Good news for Nagarjuna..High Court stay on demolition of N convention hall..!

కబ్జా చేశారంటూ ఆరోపణలు.. N- కన్వెన్షన్ హాల్ కూల్చివేత..

ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ హాల్ లోని రెండు పెద్ద హాళ్లను హైడ్రా సిబ్బంది కేవలం గంటల వ్యవధిలోనే పూర్తిగా కూల్చివేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చెరువు ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్ ప్రాంతంలో నిర్మించారని, కన్వెన్షన్ సెంటర్ గోడకు నోటీసులు అంటించి అత్యాధునిక పరికరాలు, భారీ బుల్డోజర్ల సహాయంతో కూల్చివేతలు ప్రారంభించారు. అయితే కేవలం కన్వెన్షన్ గోడకు నోటీసులు అంటించారు కానీ తమకు వ్యక్తిగతంగా ఎటువంటి సమాచారం అందివ్వలేదని.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ పరువు ప్రతిష్టను నాశనం చేస్తున్నారని తాము ఎటువంటి ప్రభుత్వ భూములను కాజేయలేదని , ప్రైవేట్ భూమిలోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించామని చెబుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అక్కినేని నాగార్జున

కూల్చివేతలు ఆపాలన్న హైకోర్టు..

విచారణ చేపట్టిన జస్టిస్ టి వినోద్ కుమార్ (Justice T.Vinodh Kumar) వెంటనే కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటికే రెండు పెద్ద హాళ్లను బుల్డోజర్ల సహాయంతో హైడ్రా బృందం కూల్చి వేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా జస్టిస్ టి వినోద్ కుమార్ తెలిపిన వివరాల మేరకు వెంటనే కూల్చివేతలు ఆపాలని ఆయన స్పష్టం చేశారు.అయితే ఈ తీర్పు వచ్చేలోపే కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు సిబ్బంది నేలమట్టం చేసేసారు. ఇక ఇప్పుడు తీర్పు వచ్చినా ఫలితం లేకుండా పోయింది అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఆరోపణలపై నాగార్జున క్లారిటీ..

ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ, అందుకే ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేస్తున్నారంటూ వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో, ఈ మేరకు నాగార్జున ఒక నోట్ కూడా విడుదల చేసారు. తాము నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ పూర్తిగా ప్రైవేట్ భూమి అని. తాను చట్ట విరుద్ధమైన పనులు ఏమీ చేయడం లేదు అని, ఒక భారతీయ పౌరుడిగా తాను అక్రమంగా ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించానని హైకోర్టు చెబితే తక్షణమే తానే కూల్చివేస్తానని నోట్ విడుదల చేశారు. అంతేకాదు తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని కోర్టును ఆశ్రయించారు నాగార్జున. అందులో భాగంగానే కోర్ట్ నుంచి స్టే వచ్చింది కానీ అంతలోపే ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టమవడం విషాదకరం అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు