Nagarjuna : అక్రమ కట్టడాలు… హైడ్రాకు సపోర్ట్ చేస్తూ నాగ్ కి కౌంటర్ ఇచ్చిన మెగా బ్రదర్..

Nagarjuna : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏ స్థాయిలో వరదలు వస్తున్నాయో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. పలుచోట్ల ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఆగిపోతున్నాయి చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కేవలం ప్రయాణికులు మాత్రమే కాకుండా సామాన్య మానవులు ఇళ్లల్లో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చేసింది. వీటన్నిటికీ కారణం మనం ప్రకృతికి చేసిన డామేజ్ అని చెప్పాలి. బంగారం లాంటి చెట్టు నరికేసి దానితోనే పేపర్ తయారు చేసి సేవ్ ట్రీస్ అని చెబుతూ ఉంటాం. చెరువులను కప్పేసి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటాం. చెరువు ప్లేస్ లో మన ఇల్లు కట్టినప్పుడు మన ఇంట్లోకి చెరువు రావడం అనేది సాధారణంగా జరిగేదే.

మనుషులు ఎప్పుడూ ప్రకృతి విరుద్ధంగా బతుకుతుంటారు. సూర్యుడికి భయపడి ఇల్లు కట్టుకుంటాం, వర్షానికి భయపడి గొడుగు పట్టుకుంటాం, ఇలా ప్రకృతికి ఎప్పుడు విరుద్ధంగానే బతుకుతున్నాం. అయితే ఈ అక్రమ కట్టడాలన్నిటికీ స్వస్తి పలకడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి హైడ్రా కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. దీనిలో భాగంగా సినీ నటుడు ప్రముఖ నిర్మాత నాగర్జున(Nagarjuna) ప్రాపర్టీ అయిన ఎన్ కన్వెన్షన్ కూల్చేసారు. దీనిపైన అనేక చర్చలు కూడా జరిగాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటినుంచో దీని గురించి మాట్లాడుతూ వస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన పనికి చాలామంది హర్షం వ్యక్తం చేశారు. ఇక తాజాగా సినీ నటుడు నాగబాబు(Nagababu) కూడా రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి ట్విట్టర్ వేదిక మద్దతుని ఇచ్చారు.

 Revanth Reddy

- Advertisement -

‘హైడ్రా’కు జనసేన నేత, నటుడు నాగబాబు మద్దతు పలికారు. ‘వర్షాలకు తూములు తెగిపోయి, చెరువులు, నాళాలు ఉప్పొంగిపోయి అపార్ట్మెంట్లలోకి కూడా నీళ్లు రావడం మనం చూస్తున్నాం. దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీటికి ముఖ్య కారణం చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడమే. దీనికి నివారణగా సీఎం రేవంత్ ధైర్యంగా హైడ్రా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనికి అందరూ సపోర్ట్ చేయాలి’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని ద్వారా మళ్లీ నాగర్జున ఏం రియాక్ట్ అవుతారు అని చాలామంది ఆతృతగా ఎదురుచూసి నెటిజన్స్ కూడా ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు