Mass Movie Re-Release : జనం ముందుకు ‘మాస్’ మళ్లీ వచ్చే డేట్ వచ్చేసింది… అప్పట్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే..?

Mass Movie Re-Release : అక్కినేని నాగార్జున నటించిన హిట్ సినిమాలలో ఒకటి మాస్.. ఆ సినిమాకు ముందు వచ్చిన సినిమాలు వేరు.. అప్పటివరకు కూల్ గా ప్రేమ కథా చిత్రాలలో నటించాడు.. ఈ సినిమాతో తనలోని అన్ని యాంగిల్స్ ను ప్రేక్షకులకు చూపించాడు.. ఆ సినిమా లాంటి సినిమా మళ్లీ నాగార్జున చేస్తే బాగుండునని ఫ్యాన్స్ అభిప్రాయ పడ్డారు.. వాళ్ల కోరిక మేరకు ఈ సినిమాను మళ్లీ రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సందర్బంగా ఈ సినిమాకు ఎంత బడ్జెట్ ను పెట్టారు? సినిమా అప్పటిలో ఎన్ని కోట్లు రాబట్టిందో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..

నాగార్జున, జ్యోతిక జంటగా నటించిన ఈ సినిమా 2004 డిసెంబర్ 23న విడుదలయింది.. చార్మీ కూడా కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకు హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు.. నాగార్జునను ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో చూపించాడు. ఆ సినిమా కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటుగా మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. సినిమాకు రూ.8 కోట్ల వరకు బడ్జెట్ ను పెడితే సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 19 కోట్లను అందుకుంది.. అప్పట్లో ఇంత కలెక్షన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు..

nagarjuna re release and how many crores it earned
nagarjuna re release and how many crores it earned

ఏపీతో పోలిస్తే నైజాంలోనే మంచి కలెక్షన్స్ రాబట్టిందన్న విషయం తెలిసిందే.. డాన్ సినిమా తర్వాత వచ్చిన మాస్ మూవీ దాదాపు రెండేళ్ల పాటు థియేటర్లలో ఆడింది.. ఈ సినిమాకు అప్పట్లో వచ్చిన కలెక్షన్స్ ఏరియా వైజ్ ఎంత రాబట్టిందంటే.. నిజాం 5.35 కోట్లు, సీడల్ 4 కోట్లు, యూఏ 2.10 కోట్లు, గుంటూరు 1.55 కోట్లు,కృష్ణ 1.10 కోట్లు, ఈస్ట్ గోదావరి 1.35 కోట్లు, వెస్ట్ గోదావరి.1.10 కోట్లు, నెల్లూరు లో 1 కోట్లు, ఇతర ఏరియాల్లో 1.80 కోట్లు రాబట్టింది.. మొత్తంగా వరల్డ్ వైడ్ చూస్తే 19 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.. ఇప్పుడు రీరిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.. మరి ఇప్పుడు ఎంత రాబడుతుందో చూడాలి.. ప్రస్తుతం నాగ్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా నా సామిరంగా సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ధనుష్ తో కుబేర సినిమాలో స్క్రీన్ ను షేర్ చేసుకుంటున్నారు.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు