Nagarjuna : సౌత్ స్టార్స్ పై షాకింగ్ కామెంట్స్.. డబ్బు తీసుకొని అంబానీ ఇంట పెళ్లికి హాజరు..!

Nagarjuna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవ మన్మధుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నాగార్జున… ఒకవైపు సీనియర్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే మరొకవైపు బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు.. అటు వెండితెర ఇటు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాగార్జున రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అడుగులు వేసి భారీగానే ఆర్జిస్తున్నారు.. అంతేకాదు పలు రకాల యాడ్స్ లో కూడా పాల్గొంటూ.. రెండు చేతులా సంపాదిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

Nagarjuna: Shocking comments on South stars.. Take money and attend wedding at Ambani's house..!
Nagarjuna: Shocking comments on South stars.. Take money and attend wedding at Ambani’s house..!

ఘనంగా ప్రపంచ కుబేరుడి కుమారుడి పెళ్లి..

అసలు విషయంలోకి వెళితే.. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రపంచ మీడియా మొత్తం ఇప్పుడు అంబానీ ఇంట పెళ్లి గురించే మాట్లాడుతుంది.. సుమారుగా రూ .5000 కోట్లు ఖర్చుతో ఈ పెళ్లి చేస్తున్నారు ముఖేష్ అంబానీ.. తన ఇంట చివరి పెళ్లి కావడంతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఇంకెవరికి సాధ్యం కాని విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని దిగ్గజ క్రీడాకారులు, సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు , రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు మెరిసారు. ఇక మన సౌత్ ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ , వెంకటేష్, రామ్ చరణ్, మహేష్ బాబు , నయనతార , రాణా వంటి సెలబ్రిటీలు అంబానీ ఇంట పెళ్లికి హాజరయ్యారు.. ఈ సందర్భంగా గతంలో నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

సినిమా సెలబ్రిటీలు డబ్బు తీసుకొని హాజరయ్యారా..

గతంలో నాగార్జున ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టాక్ షోలో.. డబ్బు ఉన్నవాళ్లంతా ఇప్పుడు సినిమా సెలబ్రిటీలకు డబ్బులు ఇచ్చి..వారిని గెస్ట్ లుగా ఆహ్వానిస్తున్నారు.. గెస్ట్ గా వస్తే కోట్లు ఆఫర్ చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీ లందరూ కూడా చాలావరకు అలాగే వెళ్తున్నారని.. కోట్లలో మనీ తీసుకుంటున్నారు అని కూడా తెలిపారు నాగార్జున.. నాగార్జున మాట్లాడుతూ.. పెళ్లిళ్లకు డబ్బులు ఇచ్చి తీసుకొస్తుంటే.. ఇంకా ఏం చెబుతామండి.. మా పెళ్ళికి రండి.. మేము డబ్బులు ఇస్తామని అంటున్నారు.. నేనెప్పుడూ అలా వెళ్లలేదు కానీ ఆ ప్రపోజల్ నాకు కూడా వచ్చింది.. గెస్ట్ గా వచ్చి 20 నిమిషాలు స్పెండ్ చేసి ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోండి అని చెబుతున్నారు. ఎంత ఇస్తారు అనేదానికి చివరాంతం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ట్స్ కి కోటి రూపాయల వరకు ఇస్తూ ఉంటారు ..అదే మన వారికి కూడా ఇప్పుడు బాగానే ఇస్తున్నారు.. సక్సెస్ ఉంటేనే మన వద్దకు వస్తారు లేకపోతే పట్టించుకోరు.. అయితే అలా వెళ్లడంలో తప్పేం లేదు. వాళ్ళు తప్పు చేయడం లేదు అంటూ వెల్లడించారు.. ఈ విషయం తెలిసిన తరువాత ముఖేష్ అంబానీ తో సౌత్ సెలెబ్రిటీలకు పెద్దగా పరిచయం లేదు.. కానీ మన సెలబ్రిటీలంతా అక్కడ సందడి చేశారు అంటే.. మన సెలబ్రిటీలంతా కూడా డబ్బు తీసుకొని అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో హాజరయ్యారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం నిజానిజాలు తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు