Nagarjuna: ఆ స్టార్ హీరోయిన్ పై మోజు.. కట్ చేస్తే..!

Nagarjuna.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నవ మన్మధుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఆరు పదుల వయసు దాటినా.. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నాగార్జున.. ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు అని చెప్పవచ్చు.. ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్లను మొదలుకొని బాలీవుడ్ హీరోయిన్ల వరకు చాలామందితో కలిసి నటించారు.. ఈ క్రమంలోనే ఆయనకు పలువురు హీరోయిన్లతో ఎఫైర్ ఉందనే వార్తలు తెగ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన ఒక హీరోయిన్ పై మనసు పడ్డారని.. అయితే ఆ హీరోయిన్ చెప్పిన మాటలు విని దండం పెట్టేసారని సమాచారం.. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

Nagarjuna: That star is obsessed with the heroine.. if it is cut..!
Nagarjuna: That star is obsessed with the heroine.. if it is cut..!

మాధురీ దీక్షిత్ పై మనసు పారేసుకున్న నాగ్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిన మాధురీ దీక్షిత్ పై మనసు పారేసుకున్నారట. అయితే తన సినిమాలలో నటించాలని ఆమెను ఒప్పించారట.. అయితే చివరికి ఆమె చెప్పిన రెమ్యూనరేషన్ విని నాగార్జున గుండెలు అదిరిపోవడంతో ఆమెకు దండం పెట్టి వచ్చేసారని సమాచారం.

మాధురీ దీక్షిత్ దెబ్బకు సైలెంట్ అయిన నాగ్..

అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె.. మైక్రోబయాలజిస్ట్ అవ్వాలనుకుంది. సినీరంగం మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి రాకముందు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. కథక్ నృత్యంలో ప్రావీణ్యం పొందిన మాధురీ దీక్షిత్ 8 ఏళ్లుగా నేర్చుకోవడంతో అది ఆమె సినీ కెరియర్ ను ఎక్కడికో తీసుకెళ్ళింది. 1984లో మాధురి దీక్షిత్ హీరోయిన్ అబోద్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తేజాబ్ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తర్వాత వరుస హిట్ లతో వెనుతిరిగి చూసుకోలేదు.. అప్పట్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గా రికార్డు సృష్టించింది.. వరుస ఫిలింఫేర్ అవార్డులు ఆమె తలుపు తట్టాయి.. ఆ టైంలో మాధురి దీక్షిత్ తెలుగులోకి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేశారు నాగార్జున. అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన ఒక సినిమాకు ఆమెను హీరోయిన్గా అడిగితే 15 రోజుల కాల్ షీట్ల కోసం ఏకంగా రూ.కోటి అడిగిందట .. వెంటనే ఆశ్చర్యపోయిన నాగార్జున .. ఇక అంత డబ్బు ఇవ్వలేక మాధురిని వద్దనుకొని మరో హీరోయిన్ తో సినిమా చేయించినట్లు సమాచారం.. ఎంతోమంది హీరోయిన్ లు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించినా కూడా బాలీవుడ్ నుంచి మాధురీ మాత్రం తెలుగులో నటించకపోవడం ఆశ్చర్యకరమనే చెప్పాలి.. ఇక ప్రస్తుతం మాధురి దీక్షిత్ నాగార్జునకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

- Advertisement -

నాగార్జున కెరియర్..

ఇక నాగార్జున విషయానికి వస్తే.. ప్రస్తుతం కొడుకుల కెరియర్ ను ఒకవైపు సక్సెస్ పథం వైపు అడుగులు వేయిస్తూనే.. తన సక్సెస్ కి కూడా బాటలు వేసుకుంటున్నారు.. ప్రస్తుతం హీరోగా పలు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు.. అలాగే షోలలో కూడా కనిపిస్తూ సందడి చేస్తున్న నాగార్జున పలు యాడ్స్లలో నటిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు