Senior Stars Heros : ఈ సీనియర్ స్టార్ హీరోలు ఇక మారరా? మార్కెట్ కోల్పోతున్నా తెలీడం లేదా?

Senior Stars Heros : టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలైన నాగార్జున, వెంకటేష్, రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున, వెంకటేష్ రెండో తరం అగ్ర హీరోలుగా ఉంటూ, తెలుగు సినీ ఇండస్ట్రీని అభివృద్ధికి తోడ్పడుతూ, నటనారంగం, నిర్మాణ రంగంలో రానిస్తున్నారు. అలాగే పదేళ్ల తర్వాతైనా రవితేజ కూడా సీనియర్ స్టార్ కిందికే వస్తాడు. చిరంజీవి తర్వాత కష్టపడి పైకొచ్చిన హీరోల్లో రవితేజ పేరు చెప్తూ ఉంటారు అభిమానులు. ఇక ఈ సీనియర్ స్టార్స్ ఇప్పటికీ తమదైన శైలిలో సినిమాలు చేస్తూ, ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ సీనియర్ స్టార్ హీరోలు తమ బ్రాండ్ వ్యాల్యూని పూర్తిగా కోల్పోతున్నారని చెప్పాలి. దీనికి ఎన్నో కారణాలున్నాయి.

Nagarjuna, Venkatesh, Ravi Teja are losing their market

మార్కెట్ కోల్పోతున్న స్టార్ హీరోలు…

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన నాగార్జున(Nagarjuna), వెంకటేష్, అలాగే రవితేజ గత కొంత కాలంగా వరుస ప్లాప్ లు అందుకుంటున్నారన్న విషయం తెలిసిందే. అడపా దడపా మధ్యలో ఒక సినిమాతో హిట్ కొట్టి, ఆ వెంటనే రెండు మూడు ప్లాప్ లు ఇస్తున్నారు. వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలు అంటూ… మూస ధోరణిలో ఔట్ డేటెడ్ కథల్ని ఎంచుకుంటూ, డిజాస్టర్లు అందుకుంటున్నారు. ఈ క్రమంలో వాళ్ళ స్థాయికి తగ్గ సినిమాలు చేయలేక వాళ్ళ మార్కెట్ ని కూడా క్రమంగా కోల్పోతున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన ఈ హీరోలు ఇప్పుడు మినిమం సినిమా కూడా ఇవ్వలేక పోతున్నారు. ఒకరేమో వయసు తగ్గని హీరో అన్న పొగడ్తలకు లొంగిపోయి, యంగ్ హీరోలు చేయాల్సిన కథలు చేస్తున్నారు. ఇంకొకరు కామెడీ వింటేజ్ సినిమాలంటూ రొట్ట కామెడీ సినిమాలు చేస్తానంటున్నారు. మరో స్టార్ అయితే మాస్ మహారాజ్ (Raviteja) అంటూ, మాస్ సినిమాల పేరిట కథలో నాలుగు డైలాగులు, ఫైట్లు ఉంటే చాలన్నట్టు సినిమాలు చేసేస్తున్నారు. ఈ క్రమంలో దారుణమైన డిజాస్టర్లు ఎదుర్కోవడమే కాక ఉన్న మార్కెట్ ని కోల్పోతున్నారు.

- Advertisement -

ఇక ఈ హీరోలు మారారా?

అయితే నాగార్జున, వెంకటేష్(Venkatesh) , రవితేజ గత చిత్రాలని గమనిస్తే.. జనాలకి అవసరం లేని కంటెంట్ తో వీళ్ళ స్థాయికి తగ్గ పాత్రలతో రావడం లేదు. పదేళ్ల కింద ఈ సీనియర్ స్టార్ హీరోల సినిమాలంటే మినిమం మెప్పించేవి. ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు వీళ్ళతో సినిమా అంటే భయపడుతున్నారు. ఒకప్పుడు వీరి సమకాలీన హీరోలు చిరంజీవి, రజినికాంత్ లాంటి సీనియర్స్ స్టార్లు ఇప్పటికీ 100 కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతుంటే, ఈ సీనియర్ స్టార్లు అందులో సగమైనా కొట్టలేకపోతున్నారు. ముఖ్యంగా రవితేజ రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ తో దారుణమైన విమర్శలు ఎదుర్కుంటున్నారు. పదేళ్లలో ఈయన చేసిన ఓ 10 సినిమాల్లో 8 సినిమాలు డిజాస్టర్లు అయ్యాయంటే అర్ధం చేసుకోవచ్చు. అభిమానులకే విసుగు పుట్టిస్తున్న పాత్రలు చేస్తున్న ఈ సీనియర్ స్టార్ హీరోలు, ఇప్పటికీ తమ మార్కెట్ ని దాదాపుగా కోల్పోయారని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అది అందరికీ అర్ధమైనా ఈ సీనియర్ స్టార్ హీరోలు ఎప్పుడు అర్ధం చేసుకుంటారో, ఎప్పుడు మారతారో అని వాళ్ళ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు