Nagarjuna : చై – శోభిత పెళ్ళెప్పుడు?… నాగార్జున ఊహించని రియాక్షన్?

Nagarjuna : టాలీవుడ్ లో కొన్నాళ్లుగా బాగా ట్రెండ్ అయిన వార్త నిజమైంది. అదే నాగ చైతన్య – శోభిత ధూళిపాళ ప్రేమ వ్యవహారం. ఈ వార్త నిజమవుతుందని దాదాపుగా చాలా మంది అనుకోలేదు. సామ్ తో విడాకుల తర్వాత కొన్నాళ్లుగా చై ఒంటరిగా ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ వాళ్ళ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉండగా, చై మాత్రం శోభిత ధూళిపాళ తో ప్రేమాయణం నడిపాడు. ఇది మొన్న మొన్నటివరకు రూమర్ గానే ఉండగా, తాజాగా వీళ్ళ ఎంగేజ్మెంట్ తో నిజం అయింది. ఇక నాగ చైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ తో సోషల్ మీడియాలో అభినందనలు వస్తున్నా, ఒక సెక్షన్ అఫ్ ఆడియన్స్ నుండి విమర్శలు కూడా వస్తున్నాయ్. ఇదిలా ఉండగా నాగ చైతన్య శోభిత కి సంబంధించి ఎలాంటి వార్తలు వస్తున్నా కొన్ని రోజుల నుండి బాగా వైరల్ అవుతున్నాయి.

Nagarjuna's unexpected reaction to Naga Chaitanya - Sobhita Dhulipala marriage?

చై- శోభిత పెళ్లిపై నాగ్ ఊహించని రియాక్షన్!

ఇక నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో సైలెంట్ గా జరిగింది. పైగా అక్కినేని ఫ్యామిలి లో ముఖ్యమైన వాళ్ళు కూడా కనిపించలేదు. ఇదిలా ఉండగా నాగ చైతన్య – శోభిత ధూళిపాళ నిశితార్థం తర్వాత మళ్ళి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. అయితే చై – శోభిత పెళ్లిపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఇక తాజాగా ఈ విషయంపై నాగార్జున (Nagarjuna) స్పందించారు. ఓ ఇంటర్వ్యూ లో నాగార్జున మాట్లాడుతూ వీళ్ళ పెళ్లి గురించి స్పందించారు. నాగ చైతన్య – శోభిత ల పెళ్లికి తాము ముందుగా ప్లాన్ చేసుకోలేదని, అంతా సడన్ గా అయిపోయిందని, ఎంగేజ్మెంట్ చేసుకోవాలని వాళ్ళు అప్పటికప్పుడు అనుకున్నారని, అందుకే చేశామని చెప్పుకొచ్చాడు. కానీ పెళ్లి మాత్రం అలా కాదు. ప్రస్తుతం వాళ్ళు కెరీర్ లో సినిమాలతో బిజీగా ఉన్నారు. పెళ్ళికి చాలా టైం ఉందని అన్నారు.

- Advertisement -

రెండేళ్లుగా వీరి ప్రేమాయణం…

ఇక నాగ చైతన్య శోభిత ల ప్రేమాయణం రెండేళ్లుగా నడుస్తుందని తెలుస్తుంది. ఓ ప్రయివేట్ హోటల్లో మొదలైన వీళ్ళ డేటింగ్, ఆ తర్వాత వెకేషన్లతో రూమర్లు బాగా స్ప్రెడ్ అయ్యాయి. కాగా తాజాగా నిశితార్థం తో రూమర్లకు చెక్ పెట్టి, నిజం చేసారు. ఇక నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో లేదా, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక అక్కినేని ఫ్యామిలీలో అందరూ సినిమాలతో బిజీగానే ఉండగా, త్వరలో అఖిల్ కూడా కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు