OG: నాగవంశీ కి ఓజి సినిమా రిలీజ్ మీద నమ్మకం లేనేట్లేనా

OG: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆన్లైన్లో టికెట్లు కొనుక్కుంటున్నారు కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరకాలి అని అంటే అది గగనం అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం క్యూలో నిల్చుంటే ఆ క్యూ థియేటర్ దగ్గర నుంచి రోడ్డు వరకు ఉండేది. అత్తారింటికి దారేది అనే సినిమా రిలీజ్ అయినప్పుడు అఫీషియల్ గా హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ గురించి ట్వీట్ కూడా చేసింది. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్.

వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో వచ్చిన 25వ సినిమా అజ్ఞాతవాసి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఫెయిల్ అయింది. ఈ సినిమా తర్వాత సినిమాలు చేయడంలో గ్యాప్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత వకీల్ సాబ్ అనే సినిమాతో రీయంట్రి ఇచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ అనే సినిమాకి రీమేక్ గా వకీల్ సాబ్ సినిమాని తెరకెక్కించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇవ్వాల్సిన హై ఎలిమెంట్స్ అన్నిటిని కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసి ఈ సినిమాలు అడాప్ట్ చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు భీమ్లా నాయక్ బ్రో ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకున్నాయి.

ఓ జి ఒరిజినల్ సినిమా

ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నిటికంటే సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓ జి సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి మొదటి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సుజిత్ ఎంత పెద్ద అభిమానో మనకు తెలియంది కాదు. అలానే రీమేక్ కాకుండా ఒక ఒరిజినల్ సినిమాను పవన్ కళ్యాణ్ తో చేస్తున్నాడు సుజిత్. ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాదాపు 10 ఏళ్ల క్రితం అదే డేట్ న అత్తారింటికి దారేది అనే సినిమా రిలీజ్ అయి ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసుకుంది.

- Advertisement -

Lucky Baskhar

ఓ జి రిలీజ్ డేట్ పై డౌటు

ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ ఉంటారు నాగ వంశీ. ఆ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ 27 అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే అదే రోజు ఓజీ సినిమా అనౌన్స్ చేశారు కాబట్టి ఆ సినిమాకు పోటీగా వస్తుందా అని అడిగిన ఒక ప్రశ్నకు నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. “పవన్ కళ్యాణ్ ఓ జి సినిమా రిలీజ్ అయితే మేము ఎందుకు పోటీగా వస్తామండి పవన్ కళ్యాణ్ సినిమా అంటే మా సినిమానే కదా” అంటూ చెప్పుకొచ్చారు. దీనిని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా వాయిదా అయ్యే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు నాగ వంశీ. ఒకవేళ ఓ జి సినిమా వాయిదా పడితే అదే డేట్ కు లక్కీ భాస్కర్ వస్తుంది. ఓజి సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అయితే లక్కీ భాస్కర్ వాయిదా పడుతుంది. ఏదేమైనా సెప్టెంబర్ 27 కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అది ఓజి సినిమా కోసం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు