Gangs Of Godavari : అస్తమాను రివ్యూల పై పడతావేంటి నాగవంశీ

Gangs Of Godavari : ఈ మధ్య టాలీవుడ్ లో కంటెంట్ ఉన్న సినిమాలు అంతగా రావడం లేదు. వచ్చిన సినిమాల్లో కాస్త యావరేజ్ గా ఉండే సినిమాలని మాత్రం నిర్మాతలు తమ సినిమాలు ఓ రేంజ్ లో ఉన్నాయని, బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతాయని రిలీజ్ కి ముందే ఊదరగొట్టేస్తారు. తీరా రిలీజ్ అయ్యాక టాక్ బాగా లేకపోయినా, మేకర్స్ పెయిడ్ రివ్యూలు కూడా వేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. అయితే కొంతమంది నిర్మాతలు మాత్రం తమ సినిమాలను ప్రమోట్ చేసుకునే తరుణంలో సినిమాలు అంతగా లేకపోయినా క్లాసిక్ అంటూ, సూపర్ హిట్ అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెపుతున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది గాని, సినిమాపై రివ్యూలు ఇచ్చే వాళ్ళని వేసుకోవడం మొదలు పెట్టారు నిర్మాతలు. తమ సినిమాలకు కావాలని తప్పుడు రివ్యూలను ఇస్తున్నారని, సినిమా బాగున్నా జనాలకి బాగా లేదని చెప్పి థియేటర్లకు రాకుండా చేస్తున్నారంటూ కొన్నాళ్లుగా గోల పెడుతున్నారు. వాళ్లలో దిల్ రాజు, నాగవంశీ లాంటి నిర్మాతలు కూడా ఉన్నారు.

Nagavamshi released the posters of Gangs Of Godavari movie as a success

సినిమా హిట్టంటూ పోస్టర్ రిలీజ్ చేసిన నాగవంశీ..

ఇక తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” (Gangs Of Godavari ) సినిమా సూపర్ హిట్ అయిందంటూ, మిక్సెడ్ రివ్యూలు, నెగిటివ్ రివ్యూలు వేసినా కూడా క్లీన్ హిట్ అయిందని బ్రేక్ ఈవెన్ అయిందంటూ పోస్టర్లు రిలీజ్ చేసారు. ఈ పోస్టర్లు చూసిన చాలా మంది నెటిజన్లు ఈ సినిమాలో ఏమంత కంటెంట్ ఉందని హిట్టయిందో అని అంటున్నారు. హీరో విశ్వక్ సేన్ పెర్ఫార్మన్స్ పక్కన పెడితే ఈ సినిమాకి పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏమి లేవు. పుష్ప ని షార్ట్ ఫిలిం గా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేసారు. అయినా రిలీజ్ అయిన నెల తర్వాత ఇప్పుడు పోస్టర్లు వేసి క్లీన్ హిట్ అయింది అంటారేంటి అని ట్రోల్ చేస్తున్నారు. ఇక విశ్వక్ సేన్ నటించిన ఈ సినిమా థియేటర్లలోంచి ఎప్పుడో వెళ్లిపోవడం, ఈ సినిమా ఓటిటి లోకి కూడా వచ్చేయడం జరిగింది.

- Advertisement -

బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు.. క్లీన్ హిట్ ఎలా?

ఇదిలా ఉండగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా బ్రేక్ ఈవెన్ అయిందంటూ క్లీన్ హిట్ అయిందంటూ పోస్టర్లు వేశారు మేకర్స్. కానీ ఈ సినిమా ఇప్పటివరకూ పూర్తిగా బ్రేక్ ఈవెన్ కాలేదు. దాదాపు 10 శాతానికి పైగా నష్టాలు తెచ్చి పెట్టింది ఈ సినిమా. గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా 11.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కాగా, ఓవరాల్ గా 10.21 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసి యావరేజ్ హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమా క్లీన్ హిట్ అయిందంటూ పోస్టర్లు వేసినంత మాత్రాన హిట్ అయిపోతుందా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా పోస్టర్లలో నెగిటివ్, మిక్సెడ్ రివ్యూలు కూడా ఎదుర్కొని బ్రేక్ ఈవెన్ అయిందంటూ నాగవంశీ రివ్యూవర్ల మీద పడ్డాడని చెప్పొచ్చు. కానీ కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవడం ఎవ్వరూ ఆపలేరనేది ఉన్నమాట. అలాగని కంటెంట్ లేకపోయినా ప్రమోషన్లతో నెట్టుకొచ్చే సినిమాలు కూడా హిట్ అవ్వలేవు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు