Gangs of Godavari: విశ్వక్ వ్యాఖ్యలుపై స్పందించిన నాగవంశీ

వెళ్ళిపోమాకే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు విశ్వక్సేన్. ఆ సినిమాతో  అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.  ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన “ఈ నగరానికి ఏమైంది” సినిమాతో మంచి గుర్తింపును సాధించాడు. నటుడిగా మంచి గుర్తింపు సాధించిన వెంటనే డైరెక్టర్ గా తనలోని మరో కోణాన్ని బయటకు తీసి “ఫలక్ నామా దాస్” సినిమాతో అద్భుతమైన హిట్టు అందుకున్నాడు.

ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోస్ లో మల్టీ టాలెంటెడ్ హీరో అంటే టక్కును గుర్తొచ్చేది “విశ్వక్ సేన్”.  కేవలం నటుడిగానే కాకుండా  దర్శకుడుగా కూడా తనలోని టాలెంట్ బయటకు తీశాడు విశ్వక్.
ప్రస్తుతం విశ్వక్సేన్ చేస్తున్న సినిమా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఈ సినిమాను “రౌడీ ఫెలో” ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్షన్ చేస్తున్నాడు. లిరిసిస్ట్ గా కెరియర్  మొదలు పెట్టిన కృష్ణ చైతన్య “రౌడీ ఫెలో” సినిమాతో దర్శకుడుగా మారాడు. దర్శకుడుగా కూడా మంచి మార్కులు సంపాదించుకున్నాడు ఆ తర్వాత నితిన్ తో చేసిన “ఛల్ మోహన్ రంగా” సినిమా కొద్దిపాటి నిరాశను మిగిల్చింది. మళ్ళీ డైరెక్టర్ గా  తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు గ్యాంగ్ సాఫ్ గోదావరి సినిమాతో రాబోతున్నాడు.

ఇక విశ్వక్ సేన్ విషయానికి వస్తే..  విశ్వక్ సేన్  ఏ సినిమా చేసిన ఆ సినిమా రిలీజ్ కి ముందు కొద్దిపాటి వివాదాలకు దారి తీయడం అనేది మామూలు విషయం.  అది కొంతమంది మిస్ అండర్స్టాండింగ్ వలన, ఇంకా కొన్ని పరిణామాలు వలన జరుగుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా రిలీజ్ కి ముందు కొంచెం కాంట్రావర్సి అయితే ఉంటుంది.

- Advertisement -

అలానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు సంబంధించి తన సినిమా పోస్ట్ పోన్ అయితే ఆ సినిమా ప్రమోషన్స్ లో తాను కనిపించనని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపాడు విశ్వక్.  దీనికి ప్రొడ్యూసర్ వంశీ స్పందిస్తూ  సినిమాను పోస్ట్ పోన్ చేయొద్దని హీరో పోస్ట్ పెట్టాడు.  అని చెబుతూ ఎవరికైనా సినిమా పోస్ట్ పోన్ చేస్తే బాధ ఉంటుంది సో ఇంకా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాకు సంబంధించి ఒక సాంగ్ ఇంకా పెండింగ్ ఉంది దాన్ని బట్టి రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు