Namitha: హాట్‌ హీరోయిన్‌ విడాకులు తీసుకోబోతుందా ?

సౌత్‌ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ నమిత ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ హీరోయిన్ ముఖ్యంగా “తెలుసునా తెలుసునా”, “దిల్ దివానా ప్యార్ హసీనా”, “సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే” అనే పాటలతో చాలా పాపులర్ అయింది. ఈ బ్యూటీ కి వరుస సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ తాను నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో ఈ అమ్మడు తన ఫోకస్ అంతా తమిళ ఇండస్ట్రీపైన పెట్టింది. ఈ హీరోయిన్ ఒకప్పుడు స్లిమ్ గా ఎంతో అందంగా ఉండేది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఒక్కసారిగా చాలా బొద్దుగా తయారయింది.

దీంతో ఈ అమ్మడికి తమిళంలో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఒకప్పుడు నమితని తమిళ అభిమానులు దేవతల ఆరాధించడంతో ఒక్కసారిగా ఈ హీరోయిన్ స్టార్ రేంజ్ కి ఎదిగింది. ఇక సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే నమిత వివాహం చేసుకుంది. వివాహ అనంతరం తాను తన భర్తతో పర్సనల్ లైఫ్ ని చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే చాలా రోజుల నుంచి నమిత తన భర్తతో విడాకులు తీసుకుంటుందంటూ అనేక వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా నమిత క్లారిటీ ఇచ్చింది. నా భర్తతో నేను విడాకులు తీసుకుంటున్నాను అంటూ చాలా రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య నేను నా భర్తతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టినప్పటికి ఇలాంటి న్యూస్ లు రావడం ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు. ఎలాంటి ఆధారాలు ఉన్నాయని మేమిద్దరం విడిపోయామని ప్రచారం చేస్తున్నారో వారికే తెలియాలి. సినిమాల్లో నటిస్తున్న సమయం నుంచి నటిగా నేను చాలా రకాల విమర్శలు ఎదుర్కొంటున్నాను. కాబట్టి ఈ ప్రచారాలు నన్ను పెద్దగా బాధ పెట్టవు. ఈ వార్తలు చూసినప్పుడు నేను, నా భర్త చాలా నవ్వుకున్నాం. ఇంత సంతోషంగా ఉన్న మనల్ని వీరు విడిపోయారని ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉందంటూ మేము అనుకునే వాళ్ళం అంటూ నమిత చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు