Namitha: అతని చేతిలో దారుణంగా మోసపోయిన నమిత ?

Namitha: ‘తెలుసునా.. తెలుసునా..’ అంటూ సొంతం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నమిత ‘దిల్ దివానా.. ప్యార్ హసీనా’ అంటూ జెమిని సినిమాతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘సింహా’ సినిమాలో ‘సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే..’ అనే పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. వరుసగా ఆఫర్లు వచ్చినప్పటికీ సింహా మినహా హిట్ మూవీ పడకపోవడంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. స్లిమ్‌గా ఉండే నమిత ఒక్కసారిగా బొద్దుగా మారడంతో తమిళంలో వరుసగా అవకాశాలు రావడంతో అక్కడే కెరీర్‌ను ప్లాన్ చేసుకుంది. తమిళ తంబీలు నమితను దేవతలా ఆరాధించడంతో అక్కడ స్టార్ హీరోయిన్‌గా మారింది. గత కొద్ది కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నమిత పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా మారింది. బీజేపీ తరఫున ప్రచారం కూడా చేసింది.

ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నమిత చేసి కామెంట్స్ కాస్త ఆసక్తికరంగా మారాయి. 2006లో తనను ఓ నిర్మాత మోసం చేశారంటూ వ్యాఖ్యలు చేసింది. “ధనుష్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో నాకు ఛాన్స్ ఇస్తామని చెప్పి ఓ ప్రొడ్యూసర్ కాల్షీట్లు అడిగారు. కానీ చివరకు ఆ సినిమాలో ఆ ప్రొడ్యూసర్ కజిన్ హీరోగా చేశాడు. ఈ విషయం తెలిసాక సినిమా షూటింగ్ సగంలో ఉండగానే బయటకు వచ్చేశాను. కానీ ఎలాగోలా సినిమాను పూర్తి చేసి విడుదల చేసేశారు. నాకు జరిగిన మోసం గురించి నిర్మాత మండలికి ఫిర్యాదు చేసినా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు” అని నమిత ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

- Advertisement -

నమిత ఇంటర్వ్యూ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నమితకు మద్దతుగా కొందరు మాట్లాడుతుండగా, సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లను బోల్తా కొట్టించడం చాలా సులువని, ఇలాంటివి మామూలేనని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించి, మాయమాటలు చెప్పి సినిమాలకు సైన్ చేయించుకోవడం కామన్ అని వీరు అంటున్నారు. నమితకు జరిగినట్టుగానే చాలా మందికి జరిగిందని, కానీ ప్రొడ్యూసర్స్‌తో పెట్టుకుంటే కెరీర్ ఫినిష్ అవుతుందనే భయంతో చాలా మంది ఓపెన్ అవరని ఇంకొందర వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నమిత లేటెస్ట్ ఇంటర్వ్యూ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది అనడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు