UpasanaKonedala : ఉపాసనకు ఆ స్టార్ హీరోల భార్యలు స్పెషల్ బర్త్ డే విషెస్..

UpasanaKonedala : గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్ ఉపాసన కొణిదెల కి ఇండస్ట్రీలో గాని సొసైటీ లో గాని చాలా మంచి పేరున్న సంగతి తెలిసిందే. ఉపాసన, రామ్ చరణ్ భార్యగానే కాకుండా యువ పారిశ్రామికవేత్తగా, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌గా, సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇప్పటికీ పలు ఛారిటీల ద్వారా అనాధ శరణాలయాలకు, జంతు సంరక్షణసంస్థలకు సేవలు అందిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా శనివారం ఉపాసన కొణిదెల పుట్టినరోజు సందర్భంగా రామ్‌ చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఉపాసనకు బర్త్ డే విషెస్ చెప్పాడు. అయితే మామూలుగా కాకుండా ‘‘కారా మమ్మీకి బర్త్ డే శుభాకాంక్షలు’’ అంటూ తనదైన శైలిలో క్లింకార తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు చరణ్. ఇదిలా ఉండగా ఉపాసన బర్త్ డే (UpasanaKonedala) కి టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు విష్ చేయడం వైరల్ అవుతుంది.

Namrata Shirodkar, Lakshmi Pranathi Special Birthday Wishes to UpasanaKonedala

ఉపాసనకు నమ్రత, ప్రణతి స్పెషల్ విషెస్..

ఇక ఉపాసన బర్త్ డే సందర్బంగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి సోషల్ మీడియాలో స్పెషల్ విషెస్ చెప్పుకొచ్చారు. ‘హ్యాపీ బర్త్ డే ఉప్సి’ అంటూ ఇద్దరూ తమ ఇంస్టాగ్రామ్ లో ఉపాసనతో సెల్ఫీ ఫోటో స్టేటస్ పెట్టి స్పెషల్ గా విషెస్ తెలియచేసారు. ఇక వీరి మధ్య మైత్రి కూడా ఆయా హీరోల లాగే ఏళ్ళ తరబడి కొనసాగుతుంది. ఉపాసన, నమ్రతా, లక్ష్మీ ప్రణతి ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ గా మెలుగుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు పలు సెలెబ్రేషన్స్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో సందడి చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళే కాక మెగా తోడి కోడలు కొణిదెల లావణ్య త్రిపాఠి కూడా స్పెషల్ గా విష్ చేయడం జరిగింది.

- Advertisement -

క్లింకార బర్త్ తో మెగా సెలబ్రేషన్…

ఇక మెగా ఫ్యామిలీ లో రామ్ చరణ్ కూతురు క్లింకార పుట్టిన తర్వాత చాలా అద్భుతాలే జరిగాయని చెప్పాలి. రామ్ చరణ్ కి డాక్టరేట్ లభించడం, చిరంజీవికి పద్మవిభూషణ్, పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం కావడం, అలాగే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి జరగడం అన్ని కలిసొచ్చాయి. ఇక ఉపాసన కూడా క్లింకార పుట్టిన తర్వాత చాలా సంతోషంగా ఉండడం గమనిస్తూనే ఉన్నాం. ఇక చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు