Balakrishna : వైరల్ అవుతున్న బాలయ్య లేటెస్ట్ లుక్.. పాతికేళ్ళు వెనక్కెళ్లాడుగా!

Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తండ్రి లాగే తన నటనతో అశేషమైన అభిమానులని సంపాదించుకున్నాడు. అద్భుతమైన నటన, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఆరు పదుల వయసులోనూ దూసుకుపోతున్నాడు. ఇక కొన్నేళ్ల ముందు వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమైన బాలయ్య అఖండ తో అఖండ విజయం సాధించి ఇప్పుడు వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. ఇక ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ఉండే బాలయ్య (Balakrishna) అభిమానులతో కొన్ని సార్లు కోప్పడినా, ఆయన నిజంగా ఎంత సరదాగా ఉంటాడో కొన్ని సార్లు తెలుస్తూనే ఉంటుంది.

Nandamoori Balakrishna Young Look Viral On Social Media

అటు ప్రజాసేవ – ఇటు కళాసేవ

రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలను వదలలేదు బాలయ్య. తన సినిమాలతో అభిమానులని ఇప్పటికి మెప్పిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఒక ఎమ్మెల్యే గా బాలకృష్ణ ప్రజా సేవ చేస్తూ, మరోవైపు తాను స్థాపించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాడు. అలాగే తన సినిమాలతో అభిమానులని మెప్పిస్తున్నాడు. ఎంతో మంది ప్రజలకు కొన్నాళ్లుగా ఎన్నికల హడావుడిలో ఉన్న బాలయ్య, రీసెంట్ గానే ఆ పనులు ముగించుకొని తిరిగి షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ కి సంబంధించిన ఓ స్టిల్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

- Advertisement -

పంచకట్టులో బాలయ్య.. పాతికేళ్ళు వెనక్కి..

తాజాగా నందమూరి బాలకృష్ణ పంచకట్టులో ఉన్న స్టిల్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ స్టిల్ లో తెలుగుదనం ఉట్టిపడుతుండగా, బాలకృష్ణ గడ్డం తీసేసి క్లీన్ షేవ్ లో అందంగా కనిపిస్తున్నాడు. ఆ లుక్ లో బాలయ్య దాదాపు పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయి యంగ్ గా కనిపిస్తున్నాడని చెప్పాలి. అయితే ఈ లుక్ ఒక కమర్షియల్ యాడ్ షూట్ కోసం చేసారని సమాచారం. ఈ యాడ్ లో సంయుక్త మీనన్ కూడా నటించింది. ఇక ఈ యాడ్ ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసాడని సమాచారం. బహుశా గోల్డ్ యాడ్ షూట్ అయి ఉండొచ్చు. ఏది ఏమైనా బాలయ్య పంచకట్టులో ఆ స్టిల్ లో అదిరిపోయాడని చెప్పాలి. ఇక బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో NBK109 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు